Published On:

Rishabh Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. కెరీర్‌లోనే రిషభ్ పంత్ బెస్ట్ ర్యాంకు ఇదే!

Rishabh Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. కెరీర్‌లోనే రిషభ్ పంత్ బెస్ట్ ర్యాంకు ఇదే!

Rishabh Pant test cricket 7th Rank: భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మంచి పురోగతి సాధించాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన వరల్డ్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మరోసారి టాప్ 10లో అడుగుపెట్టాడు.

 

అయితే టెస్ట్ హిస్టరీలో జింబాబ్వే గ్రేట్ ఆండీ ఫ్లవర్ తర్వాత ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా, అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.

 

లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలతో దూకుడుగా ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు బాదడంతో ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని ఏడవ స్థానానికి ఎగబాకాడు. అదే విధంగా భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

 

ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. భారత స్టార్ పేసర్ బుమ్రా నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 3 స్థానాలు పడిపోయి 13వ స్థానానికి వెళ్లాడు. అదేవిధంగా ఆల్ రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు.

 

ఇవి కూడా చదవండి: