Hari Hara Veera Mallu Trailer: వీరమల్లు వీర తాండవం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్

Power Star Pawan Kalyan Hari Hara Veera Mallu Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా..నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ చేసేందుకు టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈవెంట్‌లో దర్శకనిర్మాతలు, హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఉత్కంఠ తెర దింపుతూ మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మేరకు టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ట్రైలర్ విడుదల చేశారు. పవన్ లుక్స్, మ్యూజిక్, డైలాగ్స్, ఫైటింగ్ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఈ సినిమా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ ట్రైలర్‌లో ‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి కోసం పురుడు పోసుకుంటున్న సమయం.. ’అంటూ మొదలవుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ వీరమల్లుగా ఆకట్టుకున్నాడు. ఓ యోధుడి పాత్రలో యాక్షన్, డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్ చూసిన ఫ్యాన్ష్ ఆకలి తీరింది. అని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ మరోసారి విధ్వంసం సృష్టించారని అంటున్నారు.
ఇదిలా ఉండగా, రెండు రోజులుగా ట్రైలర్ లేదు అని కొంతమంది థియేటర్స్ బోర్డు పెట్టిన విషయం తెలియడంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. అయితే మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ఉదయం 11.10 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.