Published On:

Dalailama vs China: దలైలామాకు భారత్ అండ..! వారసున్ని స్వతంత్రంగా ప్రకటించవచ్చు.!

Dalailama vs China: దలైలామాకు భారత్ అండ..! వారసున్ని స్వతంత్రంగా ప్రకటించవచ్చు.!

Dalailama vs China: బౌద్ద మతగురువు దలైలామాను నిలువరించే హక్కు ఎవరికీ లేదని భారత్ స్పష్టం చేసింది. తన ఉత్తరాధికారిని నియమించే హక్కు దలైలామాకు ఉందని తెలిపింది. ఆయను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని అందులో ఎవరి జోక్యం ఉండదని స్పష్టం చేసింది. బుధవారం దలైలామా తన ఉత్తరాధికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తొందరలోనే ఉత్తరిధికారిని ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సంగతి తెలుసుకున్న చైనా దలైలామా ఉత్తరాధికారిని ఎన్నుకుంటే సరిపోదని అందుకు చైనా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని తెలిపింది. అందుకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దలైలామా కూడా ఈ విషయంపై స్పందించారు. తన నిర్ణయాన్ని చైనా అడ్డుకునే హక్కులేదని తేల్చిచెప్పారు.

 

భారత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ దలైలామా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలరని చెప్పారు. ఇది కేవలం టిబెటియన్స్ కు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆయన అనుచరులకు వర్తిస్తుందని అన్నారు. రిజిజుతో పాటు జనతాదల్ లీడర్ లలాన్ సింగ్ భారత ప్రభుత్వం తరపున దర్మశాలకు వెళ్లారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. దలైలామా 600 సంవత్సరాల పురాతనమైన పదవిని, సంస్కృతిని కాపాడుతున్నారని ఆయన తర్వాత కూడా వారి సంస్కృతికి ఎలాంటి అవరోదం ఏర్పడదని తెలిపారు. ప్రస్తుత దలైలామా 15వ వారు.

 

దలైలామా 1959 నుంచి భారత్ లోనే నివసిస్తున్నారు. ఒకప్పుడు చైనా, టిబెట్ వేరు వేరు దేశాలుగా ఉండేది. 1950పీరియడ్ లో చైనా టిబెట్ ను ఆక్రమించుకుంది. చైనా పాలనకు దలైలామాలు వారి ప్రజలు ఎదురుతిరిగారు. చైనా దాడులకు పాల్పడుతుందని తెలిసిన దలైలామా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్ కు కాలినడకన వచ్చారు. వారికి భారత్ ఆశ్రయం ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో వారు ఇప్పటికీ నివసిస్తున్నారు. ఆ తర్వాత టిబెట్ ను చైనాలో కలుపుకున్నారు. తాజాగా దలైలామా ఆయన ఉత్తరాధికారిని నియమించడానికి ప్రస్తుత దలైలామా నిర్ణయించారు.

 

ఇవి కూడా చదవండి: