Published On:

Farmers Agitation: ఉలవపాడులో రైతుల ఆందోళన.. అండగా నిలిచిన రామచంద్ర యాదవ్

Farmers Agitation: ఉలవపాడులో రైతుల ఆందోళన.. అండగా నిలిచిన రామచంద్ర యాదవ్

ramachandra yadav support farmers agitation: శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోలార్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా నిలిచారు రామచంద్ర యాదవ్. సోలార్ ప్రాజెక్ట్ కోసం పచ్చని పొలాలను బలవంతంగా లాక్కోవడాన్ని ఆయన ఖండించారు. గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. ఆదివారం గ్రామస్తులు, రైతులు ఇండో సోలార్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. . జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొంటానని రామచంద్రయాదవ్ కూడా ప్రకటించారు. దీనితో ఆదివారం కరేడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముందు రోజు రాత్రే గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు నోటీసులు ఇచ్చారుు. విజయవాడలో ఉన్న రామచంద్రయాదవ్ కు కూడా నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు, రైతులు ఉదయం పోలీసుల ఆంక్షలను చేదించుకుంటూ తమ సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేశారు.

 

పచ్చని పొలాలను కాపాడుతానని, రైతులకు అండగా ఉంటానని రామచంద్రయాదవ్ మాట ఇవ్వడంతో రైతులు సంతోషించారు. జాతీయ రహదారిని దిగ్బందించి నిరసన సెగలు ప్రభుత్వానికి తగిలేలా చేసేందుకు రైతులంతా ఏకమయ్యారు. రామచంద్రయాదవ్ వస్తున్నారని తెలిసి రెండువందల మందికి పైగా పోలీసులు ఆయన్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆదివారం కరేడులో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరేడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామస్తులు, రైతులు ఉదయం పోలీసుల ఆంక్షలను చేదించుకుంటూ తమ సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేశారు. తనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న రామచంద్ర యాదవ్ బోటులో సముద్రం గుండా ప్రయాణించి కరేడు గ్రామానికి చేరుకున్నారు. రైతులతో కలిసి దాదాపు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన జాతీయ రహదారి దిగ్బందానికి బయలు దేరారు.

 

పోలీసులు మధ్యలోనే రామచంద్ర యాదవ్ ను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. తమ నిరసనను శాంతియుతంగా తెలియజేస్తామని రామచంద్ర యాదవ్ కరాఖండీగా పోలీసులకు చెప్పారు. దాదాపు గంటన్నర పాటు పోలీసులు అడ్డుకున్నా… కాలికి చెప్పులు కూడా లేకపోయినా మండు టెండలో అలాగే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రైతులు అడుగు ముందుకేసి పోలీసుల ఆంక్షలను చేధించుకుంటూ రామచంద్రయాదవ్ తో కలిసి జాతీయ రహదారిని దిగ్బందించారు. పొలీసుల ఆంక్షలను చేధించి తనను నమ్మిన రైతులకు అండగా నిలబడ్డారు.

 

ఇవి కూడా చదవండి: