Published On:

Toll Charge: త్వరలో బైకులకు కూడా టోల్ ఛార్జ్!

Toll Charge: త్వరలో బైకులకు కూడా టోల్ ఛార్జ్!

Toll Charges To Bikes: త్వరలో బైకులకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అడుగులు పడుతున్నట్టు సమాచారం. నేషనల్ హైవేపై ఇప్పటి వరకూ బైకులకు టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉండేది. అయితే తాజాగా బైక్స్ నుంచి కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందట. ఈ మేరకు జాతీయా స్థాయిలో మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

కాగా జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్ వీలర్స్, ఇతర భారీ వాహనాలకు మాత్రమే టోల్ వసూల్ చేస్తున్నారు. కానీ బైకులు, ఆటోలు వంటి వాహనాలకు మాత్రం టోల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో టోల్ కట్టకుండానే ఆ వాహనాలు జాతీయ రహదారిపై తిరుగుతున్నాయి. దీంతో ఇక నుంచి బైకులు, ఆటోల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందట. వచ్చే నెల జులై 15 నుంచి ఈ నిర్ణయం అమలు కానుందని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై తర్వలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన రానుందని జాతీయ మీడియా పేర్కొంది.

అయితే టూ వీలర్, త్రీ వీలర్స్ వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారని వస్తున్న వార్తలపై తాజాగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టూ వీలర్, త్రీ వీలర్ కు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారనే వార్తలను ఖండించారు. ప్రస్తుతం తమ వద్ద అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి: