Nayanthara Divorce: విఘ్నేశ్ కు విడాకులు ఇవ్వనున్న నయనతార.! ఫొటో వైరల్..!

Nayanthara Divorce: నయనతార లేడీ సూపర్ స్టార్, కేవలం ఆవిడ సినిమాలే కాదు ఆవిడ ఆటిట్యూడ్ కూడా నయనతారను సూపర్ స్టార్ గా గుర్తించాయి. తమిళనాడకు చెందిన ఈ బ్యూటీ మొదటినుంచి కూడా తన చెరిష్మాతో తెలుగు, తమిళ, మళయాలం అనేతేడా లేకుండా దున్నేసింది. సినిమాలతోనే కాకుండా ప్రేమాయనంలోకూడా తన స్టైల్ ను రంగరించింది. శింభూతో మొదలైన ప్రేమాయనం ప్రభుదేవాతో కలిసి ఇప్పుడు విఘ్నేష్ తో ముడిపడింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఎప్పుడూ స్ట్రేట్ ఫార్మర్డ్ గా ఉన్న నయనతార తన మనసు ఎలా చెడితే అటు మొగ్గుచూపుతుంది.
అందులో భాగంగానే ప్రేమాయణాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళ దర్శకుడు విఘ్నేష్ తో మాత్రం ఇప్పటివరకైతే కుదురుగానే ఉంది ఈ సుందరి. తాజాగా నయన్ విఘ్నేశ్ లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అందులో భాగంగానే సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ‘స్టుపిడ్ ను పెళ్లి చేసుకుంటే వివాహం అనేది పెద్ద తప్పు అవుతుంది. భర్త చేసిన వాటికి భార్య బాధ్యత తీసుకోవద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి’ అంటూ నయన్ ఇన్ స్టా లో స్టోరీ పెట్టి డిలీట్ చేసిందని ఓ స్ర్కీన్ షాట్ వైరల్ అవుతుంది. అయితే,.. ఈ న్యూస్ ఫేక్ అని స్ర్కీన్ షాట్ కూడా ఫేక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై నయన్ విఘ్నేశ్ దంపతులు స్పందించాల్సి ఉంది. లేకుంటే అబద్దాలు నిజాలుగా రాజ్యాలు ఏలుతాయి.

Nayanatara Divorce
ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఎప్పుడూ లేనివిధంగా నయనతార ఈ సినిమాకు ప్రమోషనల్ వీడియో చేసింది. అది మొత్తం ఇండస్ట్రీని ఊపుఊపింది. ఎందుకంటే సినిమా పూర్తికాగానే నయనతార ఎప్పుడు కూడా ప్రమోషన్ లో పాల్గొనలేదు. ఇప్పుడు మాత్రం అందుకు అనిల్ రావిపూడి ఒప్పించాడు. కాగా.. తన వివాహ బంధం గురించి వచ్చిన వార్తలను నయన్ కొట్టిపడేస్తుందో లేక నిజమవుతుందో వేచిచూడాలి.