Published On:

Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్‌

Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్‌

Tejashwi Yadav: బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా ఓ డ్రోన్‌ ఆయన మీదకు దూసుకొచ్చింది. ఇది చూసి అతడు షాక్‌ అయ్యారు. దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆదివారం పాట్నాలోని గాంధీ మైదానంలో ‘వక్ఫ్ బచావో, సంవిధాన్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. బీహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతుండగా సభను కవర్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్‌ అదుపుతప్పింది.

 

మాట్లాడుతున్న తేజస్వి యాదవ్ వైపు డ్రోన్‌ దూసుకువచ్చింది. దీంతో అతడు అప్రమత్తమయ్యారు. దాని నుంచి తప్పించుకునేందుకు పక్కకు వంగారు అయితే డ్రోన్‌ వేదిక ముందు పడిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. భద్రతా సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 

ఇవి కూడా చదవండి: