Published On:

China: పదిహేను రోజులు జిన్ పింగ్ మిస్సింగ్!

China: పదిహేను రోజులు జిన్ పింగ్ మిస్సింగ్!

XI Jinping Missing: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యమయ్యారు. దాదాపు 15 రోజులు ఆయన కనిపించకుండా పోయారు. మే 21 నుంచి జూన్ 5 వరకు దేశంలో ఆయన జాడ కనిపించలేదు. ప్రస్తుతం ఈ వార్త దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలుగా చైనా ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన కనిపించడంలేదు. అలాగే వార్తాపత్రికల్లో కూడా ఆయన ప్రస్తావన రావడం లేదు.

 

కాగా జిన్ పింగ్ కనిపించకుండా పోయిన సమయంలో చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఉప ప్రధాని హీ లిఫెంగ్ విదేశీ నేతలను కలిసినట్టు సమాచారం. చైనా విదేశాంగ మాజీ మంత్రి క్విన్ గ్యాంగ్, రక్షణ శాఖ మాజీ మంత్రి లీ షాంగ్ పు వారి పదవుల నుంచి తొలగించబడే ముందు ప్రజలకు కనిపించకుండా పోయారు. దీంతో చైనాలో అధ్యక్షుడు జిన్ పింగ్ ను మార్పు చేస్తారని సమాచారం అందుతోంది. ఈ మేరకు ఆయనపై తిరుగుబాటు జరిగినట్టు తెలుస్తోంది.

చైనా ప్రభుత్వం గత శుక్రవారం ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను వారి పదవుల నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణల కారణంగా వారిని తొలగించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. అయితే అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఈ చర్య తీసుకున్నట్టు పలువురు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా స్టేట్ కౌన్సిల్ 50 మందికి పైగా మంత్రులు, పెద్ద సంఖ్యలో అధికారులు జూన్ 6న ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం కనిపించలేదు. దీంతో చైనా సైన్యం నుంచి జిన్ పింగ్ కు తిరుగుబాటు మొదలైందని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: