Published On:

Piracy in Tollywood: పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. ఒకే వక్తి, 2024లో రూ.3.7కోట్ల నష్టం.!

Piracy in Tollywood: పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. ఒకే వక్తి, 2024లో రూ.3.7కోట్ల నష్టం.!

Piracy in Tollywood: హైదరాబాద్‌లో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్‌లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా సినిమాను ఫైరసి చేస్తున్నట్లు గుర్తించారు.

ఇప్పటివరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. థియేటర్లలో ఫోన్ తో సినిమా రికార్డ్ చేశాడు. సినిమా విడుదలైన తర్వాత రోజే టెలిగ్రామ్ లో పెట్టి ఒక్కో సినిమాకు మూడు వందల డాలర్లు తీసుకుంటున్నాడు. పైరసీ ద్వారా గత ఏడాది 3500 కోట్ల వరకు నష్టం జరిగిందని ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు చేసింది. 2019 నుంచి నిందితుడు కిరణ్ ఫైరసీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టపోయింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి: