Published On:

Air Pollution: రోజు రోజుకూ భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం.! మిమ్మల్నీ మీరు రక్షించుకోండిలా.!

Air Pollution: రోజు రోజుకూ భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం.! మిమ్మల్నీ మీరు రక్షించుకోండిలా.!

Air Pollution: వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. ఎండాకాలం వెళ్లి వర్షాకాలం వచ్చేసింది. దేశవ్యాప్తంగా వర్షాలతో నీరు ప్రవహిస్తుంది. దీంతో పాటే గాలిలో కూడా మార్పులు వచ్చాయి. తేమ శాతం పెరిగింది. ఇందులోనే తేమతో పాటే వాయు కాలుష్యం కూడా దాగి ఉంది. దీని వలన ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. గాలి నాణ్యత కూడా ఘననీయంగా తగ్గింది. ఢిల్లీ లాంటి నగరాలతో పాటు రెండవ తరగతి నగరాలలో కూడా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

 

అస్తమా, అలెర్జీరినిటిస్, బ్రోన్కైటిస్ సర్వసాధారణం అవుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అధిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు గత ఐదుసంవత్సరాలలో భువనేశ్వర్ లో అధికంగా 25శాతం శ్వాసకు సంబంధమైన వ్యాధులు పెరిగాయి. బెంగుళూరులో కూడా 25శాతం అస్తమా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇది వెంటిలేషన్ లేకపోవడంతోపాటు పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా ఒక కారణం. ముంబైలో కూడా అలెర్జీ రినిటిస్ కేసులు ఇప్పుడు 18నెలల వయస్సులోపు శిశువులలో కూడా కనిపిస్తున్నాయి. ఇది సాధారణంగా మూడు సంవత్సరాల వయస్సులోపు శిశువులలో మొదలవుతాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు చిన్నపిల్లలకు, పెద్దవారికి అనే తేడా లేకుండా ఎఫెక్ట్ అవుతున్నాయి.

 

నివారణ మరియు నిర్వహణ వ్యూహాలు
ఋతువులవారీగా గాలి నాణ్యత మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి, ముందస్తు చర్యలు చాలా అవసరం. బహిరంగ ప్రదేశాలలో, మాస్క్‌లు ధరించడం మరియు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట పనులను చాలా మట్టుకు తగ్గించుకుంటే మంచిది. దీంతో పాటే ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం వల్ల బూజు మరియు దుమ్ము పురుగులు వంటి అలెర్జీలు ఎటాక్ చేయకుండా ఉంటుంది. అలాగే, మంచి వెంటిలేషన్ కూడా ముఖ్యం. అలెర్జీలు కనుక ఇప్పటికే ఎటాక్ అయితే మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.

 

భారతదేశంలో ఎయిర్ క్వాలిటీ వేగంగా మారుతుంది. రోజురోజుకు ప్రమాణం తగ్గుతుంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు శ్వాసకోశ అలెర్జీలను తీవ్రతరం చేస్తుంది. ఈ సవాళ్లను అర్థం చేసుకోవడం మరియు నివారణ వ్యూహాలను అవలంబించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి వాతావరణంలోని మార్పును చాలెంజ్ గా తీసుకుని అవసరమైన నివారణలను చేపట్టాలి. ముఖ్యంగా ఎయిర్ ప్యూరిఫైర్ ను ఇంట్లో బిగించుకోవాలి. అదీనూ పెద్ద నగరాలలో చాలా అవసరం. దాంతో పాటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు మాస్క్ ను ధరించాలి.

ఇవి కూడా చదవండి: