England vs India: నేటి నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టెస్టు.. జట్టులోకి కీలక ప్లేయర్!

England vs India 2nd Test Match at Edgbaston: ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించగా.. భారత్ టాస్ సమయంలో వెల్లడించనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ ఓటమి చెందగా.. ఈ మ్యాచ్ గెలిసి సమం చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు అదే జోరుతో ఇంగ్లాండ్ రెట్టింపు ఉత్సాహంతో 2-0 ఆధిక్యా సాధించాలని ప్రయత్నిస్తుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇరు జట్లల్లో బలమైన బ్యాటర్లు ఉన్నారు.
ఇప్పటివరకు ఎడ్జ్ బాస్టన్‌లో భారత్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ పిచ్ ఎక్కువగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. క్రమక్రమంగా బ్యాటింగ్‌కు ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.
జట్టు అంచనా:
భారత్:
యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, కరుణ్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, నితిశ్ కుమార్, అర్స్ దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, హ్యారీ బ్రూక్, జో రూట్, జేమీ స్మిత్(కెప్టెన్), బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జోష్ యంగ్, బ్రైడెన్ కార్స్, బషీర్.