Published On:

PF Withdrawal: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే.. ఎలాంటి రూల్స్ ఉంటాయ్ !

PF Withdrawal: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే.. ఎలాంటి రూల్స్ ఉంటాయ్ !

PF Withdrawal: మీరు ఉద్యోగం చేస్తుంటే.. మీ జీతంలో కొంత భాగం ప్రతి నెలా PF ఖాతాలో జమ చేయబడుతుంది. భవిష్యత్తు భద్రత కోసం.. ఈ డబ్బుపై కంపెనీ ద్వారా వడ్డీ కలుపుతారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం PF ఖాతాలో డబ్బును జమ చేయడం ముఖ్యం. కానీ.. కొన్ని అత్యవసర పరిస్థితులలో.. మీరు పీఎఫ్ డబ్బలును కూడా డ్రా చేసుకోవచ్చు. మరి మీ ఖాతా నుంచి ఎలాంటి పరిస్థితులలో.. ఎంత డబ్బును తీసుకోవచ్చో తెలుసుకుందామా..

 

EPF తో బెనిఫిట్స్:
ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక జీతం, కరవు భత్యంలో 12% EPF ఖాతాలో జమ చేయబడుతుంది. కంపెనీ (యజమాని) కూడా అదే మొత్తాన్ని అందిస్తుంది. అయితే.. దానిలో కొంత భాగం పెన్షన్ నిధికి వెళుతుంది. ఇది ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది.

 

మీరు ఏ పరిస్థితిలో డబ్బు తీసుకోవచ్చు ?
ఇల్లు కొనడానికి.. నిర్మించడానికి డబ్బు పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
మీరు ఇల్లు కొనాలనుకుంటే లేదా మీ పాత ఇంటిని పునరుద్ధరించుకోవాలనుకుంటే మీ EPF నుంచి డబ్బు తీసుకోవచ్చు. దీని కోసం.. మీ EPF సభ్యత్వం కనీసం 5 సంవత్సరాలు నిండి ఉండాలి.

 

పెళ్లిళ్లు వంటి సందర్భాలకు:
ఒక ఉద్యోగి తన పిల్లలు, తోబుట్టువుల వివాహం కోసం తన PF వాటాలో 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని జీవితంలో గరిష్టంగా మూడు సార్లు పొందవచ్చు. అయితే.. దీనికి కనీసం 7 సంవత్సరాల సభ్యత్వం అవసరం.

 

అత్యవసర పరిస్థితి:
ఉద్యోగి లేదా అతడి కుటుంబంలో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే.. చికిత్స కోసం EPF నుంచి డబ్బును డ్రా చేసుకోవచ్చు. దీని కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. మీరు మెడికల్ సర్టిఫికెట్స్ ఆధారంగా మాత్రమే డబ్బులను తీసుకోవచ్చు.

 

నిరుద్యోగం:
ఏదైనా కారణం వల్ల మీరు ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కూడా మీరు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఒక నెల పాటు నిరుద్యోగిగా ఉంటే మీరు 75% డబ్బును డ్రా చేసుకోవచ్చు. మీరు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే EPF బ్యాలెన్స్‌లో 100% డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా.. కంపెనీ 15 రోజులకు పైగా మూసివేయబడినా లేదా మీకు జీతం అందకపోయినా కూడా డబ్బును పొందవచ్చు.

 

పదవీ విరమణ తర్వాత:

పదవీ విరమణ తర్వాత.. ఉద్యోగులు తమ ఖాతా నుంచి మొత్తాన్ని తీసుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో.. పదవీ విరమణ వయస్సు సాధారణంగా 58 – 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. కొంతమంది పదవీ విరమణ తర్వాత వెంటనే డబ్బు డ్రా చేసుకుంటారు. మరికొందరు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అలా చేస్తారు.

 

డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి ?
ఈపీఎఫ్ డబ్బులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మార్గాల ద్వారా తీసుకోవచ్చు. ఇందు కోసం.. UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివేట్ చేసి ఉండాలి. అంతే కాకుండా ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి.  మీరు 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకపోతే.. కారణం లేకుండా డబ్బులు డ్రా చేస్తే.. టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ కారణాల వల్ల మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే PF నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు.

 

ఇవి కూడా చదవండి: