Published On:

Ravindra Jadeja: ప్రపంచ రికార్డును నెలకొల్పిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja: ప్రపంచ రికార్డును నెలకొల్పిన రవీంద్ర జడేజా

Ravindra jadeja: భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 2000 పరుగులతో 100 వికెట్లను తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2వేల పరుగులు పూర్తి చేయడానికి అతనికి 79 పరుగులు కావాల్సివచ్చింది. 211/5 అనే క్లిష్ట పరిస్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆతర్వాత రెండు వికెట్లను భారత్ కోల్పోయింది.

జడేజా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి 200 పరుగులకు పైగా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 41 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో సగటున 40కి మూడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 40 పరుగులు చేశాడు. 25.92 సగటుతో 132 వికెట్లు తీశాడు, అందులో ఆరు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.

 

జడేజా తన ఐదవ టెస్ట్ సెంచరీని సాధించడానికి దగ్గరలో ఉన్నాడు. జోష్ టంగ్ 89 పరుగుల వద్ద అతనిని అవుట్ చేయడానికి ప్రయత్నించాడు అతని ప్రయత్నం విఫలం అయింది. గిల్‌తో జడేజా 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా భారతదేశం 400 పరుగుల మార్కును దాటింది. దీంతో భారత్ పటిష్ట స్థితిలో ఉంది.

శుబ్మాన్ గిల్ 150 పరుగుల మార్కును దాటడంతో, భారతదేశం మొదటి ఇన్నింగ్స్ లో 500 పరుగుల మార్కును చేరుకోవాడానికి చేరువైంది. అది జరగాలంటే, భారత లోయర్ ఆర్డర్ గిల్ కు మద్దతు ఇవ్వాలి. వాషింగ్టన్ సుందర్ ఉండటంతో బ్యాటింగ్ కు మరింత బలం చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి: