India: పాక్ సెలబ్రెటీలకు భారత్ ఝలక్

Social Media Accounts Banned: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు చెందిన ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ పై కేంద్రం నిషేధం విధించింది. అయితే తాజాగా వారి అకౌంట్స్ భారత్ లో యాక్టీవ్ అయ్యాయి. దీనిపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా పాక్ కు చెందిన వ్యక్తుల, సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసింది. దీంతో హనియా అమీర్, షాహిద్ అఫ్రిది, మహీరా ఖాన్ వంటి పాక్ సెలబ్రెటీల ఇన్ స్టా, ట్విట్టర్ బ్యాన్ అయ్యాయి.
ఇండియాలోని పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో నిన్న పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్ స్టా అకౌంట్స్ ప్రత్యక్షమయ్యాయి. సబా కమర్, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, షాహిద్ అఫ్రిది, అహద్ రజా మీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్ స్టా అకౌంట్స్ ప్రత్యక్షమయ్యాయి. అలాగే హమ్ టీవీ, ఏఆర్వై డిజిటల్, హర్ పాల్ జియో వంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా స్ట్రీమ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. తిరిగి వాటిపై చర్యలు చేపట్టింది. తాజాగా ఇవాళ వాటిపై బ్యాన్ విధించింది.