India-US Tariffs: భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు.. ప్రభావం ఎంతంటే?

Ameica President Donald Trump’s reciprocal tariffs from April 2: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు ఇతర దేశాలపై టారిఫ్ సుంకాలను విధించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ ఏప్రిల్ 2న ఫైనల్ నిర్ణయాన్ని తెలపనున్నారు. అయితే ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఇతర దేశాల దిగుమతులపై టారిఫ్ సుంకాలు లేదా పన్నులను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా విదేశీ వస్తువులపై ఆధారపడకుండా ఉంటుందని వెల్లడించారు. కాగా, ఏప్రిల్ 2వ తేదీని అమెరికా దేశానికి లిబరేషన్ డేగా ట్రంప్ పేర్కొంటున్నారు. కేవలం కొన్ని దేశాలపైనే టారిఫ్ సుంకాలు విధిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలపై సుంకాల మోత ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ తెలిపారు.
ఇప్పటివరకు ప్రపంచంలోని అన్ని దేశాలతో అమెరికా ఉదారంగా వ్యవహరించిందన్నారు. కానీ ఇతర దేశాలు అమెరికాను దోచుకున్నాయని, మిత్ర దేశాలు కూడా దారుణంగా వ్యవహరించాయన్నారు. మొన్నటి వరకు సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రపంచంలో వాణిజ్యం ఒప్పందం ఉన్న అన్ని దేశాల్లో సుంకాలు ఉంటాయన్నారు.
ఈ విషయంపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడారు. అమెరికా వస్తువులపై భారత్ వంద శాతం సుంకాలు వసూల్ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇతర దేశాలు విధించడంతో అమెరికా వస్తువులను ఎగుమతి చేయడం కష్టతరంగా మారిందని, అందుకే సుంకాలు విధించేందుకు ఇదే అసలైన సమయమని వెల్లడించారు.
కొన్ని దేశాలు టారిఫ్ విషయంలో అమెరికాను పీడిస్తున్నాయన్నారు. ప్రధానంగా అమెరికా డెయిరీ ప్రొడక్ట్‌లపై ఐరోపా 50శాతం, బియ్యంపై జపాన్ 700 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం,బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం టారిఫ్ వసూలు చేస్తున్నాయన్నారు. దీంతో అమెరికాకు చెందిన వ్యాపారాలు విపరీతంగా దెబ్బతింటున్నాయని చెప్పారు. అందుకే టారిఫ్ విషయంలో చరిత్రాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, ఇదే దేశానికి భారీ గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు.