Published On:

Jaggery for Diabetes: బెల్లంతో షుగర్ కంట్రోల్.. ఎలాగో తెలుసా..?

Jaggery for Diabetes: బెల్లంతో షుగర్ కంట్రోల్.. ఎలాగో తెలుసా..?

Jaggery For Diabetes: బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫినాలిక్ ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

 

బెల్లం అధికంగా తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. జలుబు, దగ్గును నివారించడంలో కూడా సహాయపడుతుంది. మనలో చాలా మంది చెరకుతో తయారు చేసిన బెల్లం మాత్రమే ఎక్కువగా తింటుంటారు. కానీ ఖర్జూరం, కొబ్బరి బెల్లం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు.

 

చెరకు బెల్లం వల్ల తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చెరకుతో తయారు చేసిన బెల్లంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మీరు అసిడిటీ, గ్యాస్  సమస్యలతో బాధపడుతుంటే క్రమం తప్పకుండా చెరకు బెల్లం తినాలి. చెరకు బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల, ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ బెల్లం కాలేయం , గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

 

ఖర్జూర బెల్లం :
ఖర్జూర బెల్లం చాలా ముదురు రంగులో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే డయాబెటిక్ రోగులు కూడా దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. దీనిలో ఉండే లక్షణాలు షురర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా నిరోధిస్తాయి. ఖర్జూర బెల్లంలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. ఇది కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఖర్జూర బెల్లంలో ఇనుము, యాంటీఆక్సిడెంట్లు , భాస్వరం ఉంటాయి, ఈ మూలకాలన్నీ శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఈ బెల్లం పిల్లలకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పిల్లలకు తక్షణ శక్తిని అందించడమే కాకుండా.. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

 

 

ఇవి కూడా చదవండి: