Last Updated:

Health Tips: తొక్కే కదా తీసిపారేస్తే.. మీకే నష్టం..!

సాధారణంగా చాలా పండ్లు, కూరగాయలకు తొక్కను తీసేసి వండడం, తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

Health Tips: తొక్కే కదా తీసిపారేస్తే.. మీకే నష్టం..!

Health Tips: సాధారణంగా చాలా పండ్లు కూరగాయలకు తొక్కను తీసేసి వండడం తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

ఆరోగ్యం కోసం తాజా పండ్లను, కూరగాయలను తినడం ఎంత ముఖ్యమో వాటిని సరైన విధానంలో తినడం కూడా ముఖ్యమే. కానీ, చాలా మందికి ఏది సరైన విధానం అనేది తెలియదు. కొన్నింటికి పండు తిని తొక్క పారేయాలి, మరికొన్నింటికి తొక్కతో కలిపి తినాలి. అప్పుడే ఆ పండు లేదా కూరగాయ నుంచి మనకు అందాల్సిన పోషకాలు అందుతాయి. పండ్లలో కంటే తొక్కలోనే 25-30 శాతం పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. కూరగాయలలో 31 శాతం పీచుపదార్థం తొక్కలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పట్నించి ఏదైనా తినేటపుడు తొక్కే కదా అని తీసి పారేయకుండా, తొక్కతో కలిపి తినండి.

ఆరెంజ్
నారింజలో విటమిన్ సి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే పండులో కంటే తొక్కలో విటమిన్ సి రెండింతలు ఎక్కువగా ఉంటుందట. విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు నారింజ తొక్కలో పుష్కలంగా ఉంటాయి. కానీ ఆరెంజ్ తొక్క తింటే అది సులభంగా జీర్ణం కాదు. కాబట్టి తొక్కను తురముకోవాలి. నారింజ తురుమును కొద్దికొద్దిగా సలాడ్లు, ఆహార పదార్థాలు, పానీయాలలో పై నుంని గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే ఎండబెట్టి వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా పండులోని పోషకాలు పూర్తిగా పొందవచ్చు.

మామిడి పండు
మామిడి తొక్కలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్లు ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ , కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి తొక్కలు పారేసే ముందు ఆలోచించండి.

ఆపిల్
కొంతమంది ఆపిల్‌ను కూడా పొట్టు తీసి తింటారు. ఆపిల్‌ను దాని చర్మంతో కలిపి తినడం వల్ల విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఆపిల్‌ను వాటి తొక్కలతో కలిపి తినడం వల్ల మెదడు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.

పుచ్చకాయ
చాలా మంది పుచ్చకాయ గుజ్జు మాత్రమే తిని తొక్కను పారేస్తారు. కానీ దీని తొక్కలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తం నుండి నత్రజనిని తొలగించడంలో సహాయపడుతుంది. గుజ్జులో కంటే పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తొక్కను వేయించి కూరగాయగా తినవచ్చు. మీకు కావాలంటే, మీరు దాని నుండి ఊరగాయను తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ తొక్కతో హల్వా కూడా చేస్తారు.

బంగాళదుంప
ఆలుగడ్డలలో లోపల ఉండే దుంప కంటే, పైన ఉండే చర్మంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. చర్మం తొలగించి వండిన బంగాళదుంపల కంటే చర్మంతో కలిపి వండిన బంగాళదుంపలు తింటే విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, ఎక్కువ మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయి. బంగాళదుంప తొక్కలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దోసకాయ
దోసకాయ తొక్కలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది, రక్తం గడ్డకట్టడంలో అవసరం అవుతుందు.
దోసకాయ తొక్క చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ కలిగి ఉంటుంది.

ఇదీ చదవండి: ఆమ్లా(ఉసిరి)తో ఆరోగ్య ప్రయోజనాలు మెండు