Published On:

#RAPO22 Update: అందని వాడు.. అందరివాడు.. ఆంధ్రా కింగ్ వచ్చేశాడు

#RAPO22 Update: అందని వాడు.. అందరివాడు.. ఆంధ్రా కింగ్ వచ్చేశాడు

Upendra as Surya Kumar in #RAPO22:  ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం RAPO22.  మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో ఒక  కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో ఒక సీనియర్ స్టార్ హీరోను తీసుకోవాలని మేకర్స్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపించాయి.

 

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నుంచి విజయ్ సేతుపతి వరకు అందరిని అనుకోని చివరకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేనా ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. ఇక తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. ఉపేంద్రను అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించారు. అందని వాడు.. అందరివాడు మన సూర్య కుమార్  అంటూ క్యాప్షన్ ఇస్తూ ఉపేంద్ర పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 

క్యాప్షన్ కి తగ్గట్టే.. ఉపేంద్ర చాలా స్టైలిష్ గా.. జనం మధ్యలో నిలబడి కనిపించాడు. ఇక ఈ సినిమాలో సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర నటించినా.. ఆయన ఒక స్టార్ హీరోకు ఫ్యాన్ గా కనిపిస్తాడట. ఇక ఆయనకు ఆంధ్రా కింగ్ అనే బిరుదు ఉంటుందట. అందుకే ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ నుమే మే 15 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.