HIT 3 OTT Release: అప్పుడే ఓటీటీకి వస్తున్న ‘హిట్ 3’ – స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..?

Nani’s HIT 3 Movie OTT Release and Streaming Details: నాని నటించి లేటెస్ట్ మూవీ ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3 Movie). హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూడో చిత్రమిది. దీంతో హిట్ 3పై అంచాలు భారీగా నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందు ప్రమోషనల్ కంటెస్ట్ కూడా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. ఎన్నో అంచనాల మధ్య మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.
కానీ, కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో సాధించలేకపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు అవుతుంది. ఇప్పటికీ అక్కడక్కడ ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో హిట్ 3 ఓటీటీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం మూవీ రిజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కావాలి. దాని ప్రకారం చూస్తే ఈ సినిమా మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సినిమాను త్వరలోనే డిజిటల్ ప్రీమియర్‌కు ఇచ్చేందుకు సదరు సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. కాగా హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా హిట్3(HIT: The Third Case)ని తీసుకోచ్చారు. మొదటి రెండు పార్ట్స్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక మూడో భాగంగా సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు బాగానే ఉన్నా.. దీనికి యాక్షన్, వయోలెన్స్ మాత్రం ఓ రేంజ్‌లో యాడ్ చేశారు. రక్తపాతం కూడా బాగానే పారించారు. దీంతో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దక్కింది.
మూవీ చూసేందుకు వారు పద్దగా ఆసక్తి చూపించకపోవడంతో కలెక్షన్స్ రేంజ్ తగ్గింది. అయినా మూవీలో నాని నటనకు మాత్రం విమర్శకులు ప్రశంసలు దక్కాయి. కాగా ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్పుల్ పోలీసు ఆఫీసర్‌గా నాని కనిపించాడు. విచిత్రమైన మర్డర్ జరిగితే దాన్ని దర్యాప్తు చేస్తుంటతాడు. అయితే ఇలాంటి హత్యలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయని తెలిసి పోలీసులు షాక్ అవుతారు. దీంతో ఈ కేసు విచారణకు అర్జున్ సర్కార్‌ను నియమిస్తారు. ఇంతకి ఆ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరూ? చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.