Bhagyashri Borse: రామ్ పోతినేనితో డేటింగ్? – క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse Reply to Netizen Comment: నటి భాగ్యశ్రీ భోర్సే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఎనలేదని క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ భామ. ఇందులో ఆమె అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఒక పాటలో రవితేజతో చేసిన రొమాన్స్‌కి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. తొలి సినిమాకే ఈ రేంజ్‌లో రొమాన్సా అని అంతా ఆమె గురించి మాట్లాడుకున్నారు.
ఇక ఈ మూవీ డిజాస్టర్ అయిన భాగ్యశ్రీకి మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కడుతుఊనే ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో, మహానటి ఫేం దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా, ఉస్తాద్ శంకర్.. రామ్ పోతినేనితో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే రామ్‌తో సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ అని ప్రకటించినప్పుడు ఆమె ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇక రామ్‌తో డేటింగ్ వార్తలతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది.
వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ మొదలైందని, రామ్.. భాగ్యశ్రీలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై వీరు ఇప్పటికి నోరు విప్పలేదు. దీంతో రోజురోజుకు వారి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకుంటున్నాయి. తాజాగా రామ్ పోతినేని, భాగ్యశ్రీలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. వీరి ఫోటోల్లో బ్యాగ్రౌండ్ ఒకేలా ఉంది. వారు బస చేస్తున్న హోటల్ నుంచి ఈ ఫోటోలు షేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది గమనించిన కొందరు ఇద్దరు ఒకే హోటల్‌లో ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
ఇక మరికొందరైతే భాగ్యశ్రీ చేతికి ఉన్న రింగ్ చూసి అది ఎవరిచ్చారు.. ఆ అబ్బాయి ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని కామెంట్స్‌లాగే దీన్ని చూసి వదిలేయకుండ.. ఈ కామెంట్ ఆమె రిప్లై ఇచ్చింది. ఇది ఎవరు తనకు ఇవ్వలేదని, తానే కొనుకున్నానంటూ సదరు నెటిజన్‌కి కామెంట్స్ ఆమె రిప్లై ఇచ్చింది. ఇక నెటిజన్ కామెంట్‌కి ఆమె స్పందించడం ఇదికాస్తా నెట్టింట్ ట్రెండ్ అవుతుంది. అయితే రామ్‌తో రిలేషన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలకు భాగ్యశ్రీ ఇలా చెక్ పెట్టింది. ఇది నిజం కాదని, తాను సింగిల్ అని ఆమె చెప్పకనే చెప్పిందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- Chhaava Box Office Collection Day 66: ఆల్‌టైం బ్లాక్‌బస్టర్ ‘ఛావా’.. లాంగ్ రన్‌లోనూ కలెక్షన్ల ఊచకోత, మొత్తం నెట్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?