Published On:

Ram Pothineni New Movie Title: ఒక్క టైటిల్ తో ఎన్టీఆర్, నాగ్, పవన్ ని కవర్ చేసిన రామ్.. అదిరిపోయిందిగా..!

Ram Pothineni New Movie Title: ఒక్క టైటిల్ తో ఎన్టీఆర్, నాగ్, పవన్ ని కవర్ చేసిన రామ్.. అదిరిపోయిందిగా..!

Ram Pothineni’s New Movie Title is ‘Andhra King Taluka’:  సినిమాకు టైటిల్ అనేది చాలా ముఖ్యం. కథను బట్టి సినిమా టైటిల్ ను ఎంచుకుంటారు మేకర్స్. ఆ టైటిల్ లో మిగతా హీరోల టైటిల్స్ కూడా కలిస్తే..  మిగతా హీరోల ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. తాజాగా రామ్ పోతినేని.. ముగ్గురు హీరో ; అను కవర్ చేసేలా అద్భుతమైన టైటిల్ ను పట్టాడు. ప్రస్తుతం రామ్.. ఒక  మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్నేళ్లుగా రామ్  సినిమాలు చేస్తున్నాడు కానీ, హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఈసారి మాత్రం యాక్షన్ కాకుండా ఫ్యామిలీ, లవ్ మోడ్ లోకి దిగి ఒక మంచి కథతో రాబోతున్నాడు. అదే RAPO22.

 

మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇక ఈ సినిమాలో ఉపేంద్ర ఒక స్టార్ హీరోకు వీరాభిమానిగా కనిపించనున్నాడట. అందుకే ఆయనకు ఆంధ్రా కింగ్ అనే బిరుదు ఉంటుందని, రామ్.. ఉపేంద్ర తాలూకా కావడంతో ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ అయితే యాప్ట్ గా ఉంటుందని ఆ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒక్క టైటిల్ తో ముగ్గురు హీరోలకు సంబంధం ఉంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆంధ్రావాలాలో ఆంధ్రా.. కింగ్ అంటే నాగార్జున బిరుదు.

 

ఇక జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచాడో.. అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఎంత రచ్చ చేసారో అందరికి తెల్సిందే. ఇక ఈ మూడు పేర్లను కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ వచ్చింది.  ఇది అనుకున్నది కాకపోయినా.. ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూడు పేర్లు కలిసి వచ్చేసరికి మరింత హైప్ పెరిగింది. త్వరలోనే ఈ. టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

ఇవి కూడా చదవండి: