Published On:

Ram Pothineni: ఆ హీరోయిన్ తో రామ్ డేటింగ్.. హోటల్ గదిలో ఇద్దరూ ..?

Ram Pothineni: ఆ హీరోయిన్ తో రామ్ డేటింగ్.. హోటల్ గదిలో ఇద్దరూ ..?

Ram Pothineni: ఇండస్ట్రీలో పుకార్లు సర్వ సాధారణం. ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించి హిట్ కొట్టినా… వరుసగా రెండు మూడు సినిమాలో నటించినా వారి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తాయి. ఇక కెమెరా కంటికి ఇద్దరూ కలిసి కనిపిస్తే అంతే సంగతులు. ఇలా కెమెరా కంటికి కనిపించి ప్రేమ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జంటలు చాలానే ఉన్నాయి.

 

అయితే తాజాగా టాలీవుడ్ లోకి మరో కొత్త జంట ఎంట్రీ ఇచ్చింది. ఈ జంట కలిసి ఒక్క సినిమాలో కూడా ఇంకా కనిపించలేదు. అప్పుడే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ జంట ఎవరో కాదు ఉస్తాద్ రామ్ పోతినేని, హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఏంటి.. నిజంగా వీరు ప్రేమలో ఉన్నారా? అంటే.. తెలియదు. కానీ, సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉన్న ఫోటోలు మాత్రం షేక్ చేస్తున్నాయి.

 

రామ్, భాగ్యశ్రీ కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాగర్ అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో రామ్ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం లుక్ మొత్తం మార్చేశాడు. ఇక మిస్టర్ బచ్చన్ తో ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ.. రెండో సినిమాగా రామ్ సరసన నటించే చాన్స్ పట్టేసింది. వీరిద్దరి పెయిర్ కి మంచి ఆదరణే లభించింది.

 

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే భాగ్యశ్రీ ఈ మధ్యనే ఒక ఫోటో షేర్ చేసింది. ఒక హోటల్ గదిలో సన్ కిస్ పోజులో కనువిందు చేసింది. ఇక అదే బ్యాక్ గ్రౌండ్ లో రామ్ ఫోటో కూడా ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ ఒక హోటల్ గదిలో ఉన్నారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే రామ్ ఫోటోలో ఉన్న లుక్ .. ఇప్పుడు ఉన్న లుక్ వేరుగా ఉండడంతో కొందరు రామ్ ఓల్డ్ ఫోటో అని చెప్పుకొస్తున్నారు.మరి వీరిద్దరి మధ్య ఉన్న కహానీ ఏంటి అనేది బయటపడాలి అంటే ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.