Last Updated:

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఏవంటే..?

సెప్టెంబరు నెల ముగింపునకు చేరుకుంది. ఇక ఈ నెల చివరిలో ఫ్యాన్స్ కి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు వస్తాడు అనుకున్న ప్రభాస్.. సలార్ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఆ మూవీ వాయిదా పడటంతో పలు చిత్రాలు అనుకున్న డేట్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఏవంటే..?

Upcoming Releases : సెప్టెంబరు నెల ముగింపునకు చేరుకుంది. ఇక ఈ నెల చివరిలో ఫ్యాన్స్ కి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు వస్తాడు అనుకున్న ప్రభాస్.. సలార్ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఆ మూవీ వాయిదా పడటంతో పలు చిత్రాలు అనుకున్న డేట్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ కి ఘనంగా వీడ్కోలు పలికేలా రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాల వివరాలు..

స్కంద..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని (Skanda Movie) జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘స్కంద’ విడుదల కానుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా మంచి సక్సెస్ కొట్టాలని అంతా భావిస్తున్నారు.

చంద్రముఖి 2..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు. కాగా మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నారు. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన చిత్రం ‘చంద్రముఖి 2’ . ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వ్యాక్సిన్‌ వార్‌..

వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదాల మధ్య విడుదలైనా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మరో చిత్రంతో రాబోతున్నారు. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’. కరోనా నాటి పరిస్థితులను, డాక్టర్స్, సైంటిస్ట్స్.. చేసిన సేవలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబరు 28న ఈ చిత్రం విడుదల కానుంది.

పెదకాపు – 1.. 

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో విరాట్‌ కర్ణ హీరోగా ఆయన రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు – 1’ . కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాసిక్‌ మూవీలను తీసిన శ్రీకాంత్ ‘నారప్ప’తో తన పంథాను మార్చారు. ఇక ఈ మూవీతో మరోసారి రా అండ్ రాస్తిక్ మోడ్ లోకి దిగినట్లు కనబడుతుంది. ఇక ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా చేయగా.. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.  అనసూయ, రావు రమేష్, బ్రిగిదా, తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Peddha Kapu 1 (2023) - IMDb

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

గాండీవధారి అర్జున (టాలీవుడ్) సెప్టెంబరు 24

ద డెవిల్స్‌ ప్లాన్‌ (కొరియన్‌ వెబ్ సిరీస్‌) సెప్టెంబరు 26

కాసిల్వేనియా (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 28

ఐస్‌కోల్డ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 28

లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 28

చూనా (బాలీవుడ్) సెప్టెంబరు 29

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

ద ఫేక్‌ షేక్‌ (వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 26

హాస్టల్ డేజ్‌ (బాలీవుడ్ ) సెప్టెంబరు 27

కుమారి శ్రీమతి (టాలీవుడ్) సెప్టెంబరు 28

జెన్‌ వి (వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 29

డిస్నీ+హాట్‌స్టార్‌..

కింగ్‌ ఆఫ్‌ కొత్త (మాలీవుడ్) సెప్టెంబరు 28

లాంచ్‌ పాడ్‌ (వెబ్‌ సిరీస్) సెప్టెంబరు 29

తుమ్‌ సే నహీ పాయేగా (హిందీ) సెప్టెంబరు 29

ఆహా..

పాపం పసివాడు (టాలీవుడ్) సెప్టెంబరు 29

సోనీలివ్‌..

ఏజెంట్‌ (టాలీవుడ్) సెప్టెంబరు 29

అదియా (కోలీవుడ్) సెప్టెంబరు 29