Last Updated:

Skanda Movie : ఉస్తాద్ రామ్ పోతినేని “స్కంద” మూవీ నుంచి “కల్ట్ మామ” సాంగ్ .. ఎప్పుడంటే ??

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఊర మాస్ అవతార్ లో రాబోతున్న చిత్రం "స్కంద". మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి.

Skanda Movie : ఉస్తాద్ రామ్ పోతినేని “స్కంద” మూవీ నుంచి “కల్ట్ మామ” సాంగ్ .. ఎప్పుడంటే ??

Skanda Movie : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఊర మాస్ అవతార్ లో రాబోతున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా.. రాపో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. రామ్ కూడా ఈ సినిమా లుక్ కోసం బాగా మెకోవర్ అయినట్లు కనబడుతుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని (Skanda Movie) జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అలానే ఈ సినిమాలో శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన పత్రాలు పోషించారు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా “కల్ట్ మామ” అనే స్పెషల్ సాంగ్ కి త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ “ఊర్వశి రౌతేలా” స్టెప్పులేస్తుండడం విశేషం అనే చెప్పాలి. డాన్స్ లో తనదైన ఎనర్జీ చూపిస్తూ రెచ్చిపోయే రామ్ ఈ సాంగ్ లో ఏ రేంజ్ లో అదరగొడతారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

 

ఇక ఇప్పటికే ఊర్వశి.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’, అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టింది. ఈ సాంగ్ కూడా మంచి హిట్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.