Thaman: ‘అఖండ 2’పై తమన్ ఫస్ట్ రివ్యూ – ఫస్టాఫ్ పైసా వసూల్.. సెకండాఫ్ అంతకు మించి!
Thaman First Review on Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. 2021లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఇటీవల కుంభమేళలో లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏపీలో కృష్ణానది తీరాన కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ మేరకు డైరెక్టర్ బోయపాటి శ్రీను స్వయంగా లోకేషన్స్ పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ అంచనాల నెలకొలన్నాయి.
ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అఖండ 2పై చేసిన కామెంట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అనంతపూరం జిల్లాలో జరిగిన డాకు మహారాజ్ మూవీ విజయోత్సవ సభలో తమన్ మాట్లాడుతూ.. అఖండ 2 నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుంటూ బజ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా కోసం బోయపాటి ప్రత్యేక శ్రద్ధా తీసుకున్నాడని, ఫ్యాన్స్ అంచనాలను మించి అవుట్ పుట్ ఇచ్చిందుకు కసిగా పని చేస్తున్నాడన్నాడు. ఫస్టాఫ్ పైసావసూళ్లు అని చెప్పాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందని, ఆ సీన్ ఆడియన్స్‌కి గూస్బంప్స్ తెప్పించడం పక్కా అంటూ మరింత బజ్ పెంచాడు.
ఇక సెకండాఫ్ అంతకు మించి ఉండబోతుందంటూ తమన్ మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌తో నందమూరి అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. అఖండ 2 రిలీజ్ అయిన థియేటర్లో మాస్ జాతరే అంటూ అంచనాల్లో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటీవల కుంభమేళలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంది. ఇక్కడ ఇంట్రాడక్షన్ సీన్స్‌తో పాటు పలు ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గుడిమెట్ల గ్రామం కృష్ణానది తీరాన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోస బోయపాటి స్వయంగా వెళ్లి అక్కడి లోకేషన్స్ పరిశీలించినట్టు సమాచారం.