Published On:

Samantha Like a Post: భర్తలపై సర్వే – ఆ పోస్ట్‌కు లైక్‌ కొట్టిన సమంత.. చైతో విడాకులకు అదే కారణమా?

Samantha Like a Post: భర్తలపై సర్వే – ఆ పోస్ట్‌కు లైక్‌ కొట్టిన సమంత.. చైతో విడాకులకు అదే కారణమా?

Samantha Liked Instagram Post: స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ లైక్‌ కొట్టడంతో దీనికి కారణం. దీంతో మరోసారి సమంత-నాగచైతన్య విడాకులపై చర్చ మొదలైంది. కాగా విడాకులు తర్వాత సమంత ప్రొఫెషనల్‌గా కంటే పర్సనల్ లైఫ్‌తో ఎక్కువగా తెరపైకి వస్తుంది. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి ఆమెను మరింత బలహీనం చేశాయి. అయినా కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని మయోసైటిస్‌ను జయించింది.

 

డైరెక్టర్ తో రెండో పెళ్లి?

అంతేకాదు విడాకుల తర్వాత తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌ని సైతం ధైర్యంగా ఎదుర్కొంది. అప్పటి నుంచి ఆధ్యాత్మికత, ఆరోగ్యం, మెడిటేషన్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది.  సోషల్‌ మీడియాలో తరచూ మోటివేషనల్‌ కోట్స్‌, మహిళల సంరక్షణకు సంబంధించిన సందేశాలు షేర్‌ చేస్తూ అందరిలో స్పూర్తి నింపుతుంది. మరోవైపు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో రిలేషన్‌, రెండో పెళ్లితో వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా సమంత ఓ పోస్ట్‌కి లైక్‌ కొట్టింది. అది వైవాహిక బంధాలు విఛ్చిన్నం కావడానికి కారణాలు తెలిపే పోస్ట్‌ అది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను భర్త వదలించుకునేందుకే ఇష్టపడుతున్నాడని చెప్పే పోస్ట్‌ అది.

 

వైవాహిక బంధానికి సంబంధించిన సర్వే పోస్ట్

దానికి అవును అని చెబుతూ ఆ పోస్ట్‌ని సామ్‌ లైక్‌ కొట్టింది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పిర్చ్యువల్‌, మోటివేషనల్‌కు సంబంధించి ఎన్నో ఖాతాలు ఉన్నాయి. అలాగే సక్సెస్‌ వేర్స్‌ పేరుతో ఉన్న ఒక ఖాతాలో ఎక్కువ ఆరోగ్యం, భార్యభర్తల బాండింగ్‌, కుటుంబ బంధాల గురించిన కోట్స్‌ని షేర్‌ చేస్తుంటారు. అలా ఈ ఖాతాలో తాజాగా భార్యభర్తల బంధానికి సంబంధించిన సర్వే పోస్ట్‌ షేర్‌ చేశారు. ‘ఒక కుటుంబంలో భార్య తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నాడు. కానీ, భర్త అనారోగ్యానికి గురైతే మాత్రం భార్య అతడిని విడిచిపెట్టేందుకు అస్సలు ఇష్టపడదు’ అని ఉంది.

 

అలాగే ఇది ఒక సర్వేలో నిర్ధారించబడిందని, పరుషులు తమ జీవిత భాగస్వామికి ప్రాణాంత వ్యాధి సోకితే ఆమెను వదిలించుకునేందుకు ప్రతి వెయ్యి మందిలో 624 మంది మొగ్గుచూపుతున్నారని గణంకాలతో సహా ఆ సర్వే నిరూపుతమైంది. భార్య అనారోగ్యం వల్ల చాలమంది పురుషులు భావోద్వేగ, శారీరక సాన్నిహిత్యం కోల్పోవడం వల్లే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనారోగ్యం సమయంలో భార్యను వదిలివేయడం వెనుక దాగి ఉన్న పూర్తి విషయాలు ఇంకా ఏమున్నాయో ఈ ప్రపంచానికి నిరూపిద్దాం” అని ఆ పోస్ట్‌లో ఉంది.

 

చైతో విడాకులకు కారణం ఇదేనా?

ఇదే పోస్ట్‌ని సమంత లైక్‌ చేసింది. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది మాత్రమే కాదు, ఇందుకు సంబంధించిన మరెన్నోపోస్ట్స్‌ని సమంత లైక్‌ చేసింది. దాదాపు 60వేల పోస్టులను సామ్‌ లైక్‌ చేసినట్టు సమాచారం. దీంతో సమంత, నాగ చైతన్య విడాకులు కూడా ఆమె వ్యాధి మయోసైటిస్‌ కారణం కూడా ఒకటై ఉంటుందని అంతా సందేహిస్తున్నారు. సమంతకు ఈ వ్యాధి ఉందని తెలిసే చై ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాడా? అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో సమంత, నాగ చైతన్యలు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2022లో సామ్‌ మయోసైటిస్‌ వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. దానికి చికత్స పొందుతూనే శాకుంతలం, ఖుషి, సిటాడెల్‌ హనీ బన్నీ సినిమాలు పూర్తి చేసింది.