Last Updated:

Salman Khan: నా జీవితం ఆయన చేతుల్లోనే ఉంది – హత్య బెదిరింపులపై సల్మాన్‌ ఖాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Salman Khan: నా జీవితం ఆయన చేతుల్లోనే ఉంది – హత్య బెదిరింపులపై సల్మాన్‌ ఖాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Salman Khan About Life Threat From Lawrence Bishnoi Gang: బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్, నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించి చిత్రం ‘సికందర్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా రంజాన్‌ పండుగ సందర్భంగా మార్చి 30న థియేటర్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అలాగే సల్మాన్‌ కూడా సికందర్‌ విడుదల నేపథ్యంలో వరుస ఇంటర్య్వూలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కొంతకాలంగా తనకు వస్తున్న హత్య బెదిరింపులపై సల్మాన్‌ స్పందించాడు.

 

కృష్ణ జింక కేసులో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొద్ది రోజులుగా గ్యాంగస్టర్‌ లారెన్స్‌ బిష్టోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పలుమార్లు ఆయనపై దాడి కూడా యత్నించారు. ఈ క్రమంలో బాంద్రాలోని ఆయన ఇంటి ముందు రెక్కీ వేసి ఇంటిపైకి కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఇదే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పనే అని విచారణ తేలిసింది. ఎప్పటికైన సల్మాన్‌ చంపి పగ తీర్చుకుంటామంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ బహిరంగ వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత నుంచి ఆయనకు బెదిరింపుల ఎక్కువ అయ్యాయి.

 

అయితే తాజాగా ఈ హత్య బెదిరింపులపై సల్మాన్‌ ఖాన్‌ స్పందించాడు. ‘నేను ఎక్కువగా దేవుడిని నమ్ముతాను. ఏం జరిగిన ఆయన అది తలరాత ప్రకారం జరుగుతుంది. నా జీవితం దేవుడి చేతుల్లోనే ఉంది. ఆ దేవుడు నా ఆయుష్షు ఎంతవరకు ఇచ్చాడో అంత వరకు మాత్రమే జీవిస్తాను. ఇదంతా దేవుడి ఇష్టం. ఏదేమైనా ఆందోళనగా ఉన్నపటికీ ఏది మన చేతుల్లో ఉండదు. బెదిరింపులు నేపథ్యంలో ప్రభుత్వం నాకు గట్టి భద్రత ఇచ్చింది. కానీ ఒక్కోసారి ఇది కూడా సవాలుగా అనిపిస్తుంది” అని అన్నారు.

 

ప్రస్తుతం సల్మాన్‌ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ హత్యా బెదిరింపు నేపథ్యంలో సల్మాన్‌కు ప్రభుత్వం వై కాటగిరి భద్రత కల్పించింది. అంతేకాదు ఇద్దరు బాడిగార్డ్స్‌ని కూడా నియమించింది. ఇటీవల సల్మాన్‌ తన ఇంటి బాల్కానీకి బుల్లెట్‌ ఫ్రూవ్‌ గ్లాస్‌ను కూడా అమర్చాడు. విదేశాల నుంచి ఖరీదైన బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారును కూడా దిగుమతి చేసుకున్నారు. దీంతో ఎక్కడికి వెళ్లిన పటిష్టమైన భద్రత నడుమ సల్మాన్‌ ఇంటి నుంచి కాలు బయటపెడుతున్నారు. భద్రత దృష్ట్యా ఆయన పబ్లిక్‌ ఈవెంట్స్‌లో పాలోనడం లేదనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: