Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. రామ్ చరణ్ యాక్టింగ్ ఓ లెవల్.. శంకర్ ఈజ్ బ్యాక్!

Ram Charan Game Changer movie Twitter Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్.’ ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో ఎస్ జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని తదితరులు నటించారు. శ్రీమతి అని సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజ్, శిరీష్ నిర్మించారు.భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మేరకు కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శించగా.. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ రివ్యూ ఇస్తున్నారు. మరి ఈ సినిమా గురించి ఏవిధంగా రివ్యూ ఇస్తున్నారో తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బెనిఫిట్ షోలు చూసిన తర్వాత తమ అభిప్రాయాలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ ఓ లెవల్ అంటూ పొగిడేస్తున్నారు. శంకర్ మార్క్ మరోసారి మూవీలో కినిపించిందని కామెంట్స్ పెడుతున్నారు. శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ యాక్టింగ్ ఫర్పెక్ట్ సెట్ అయిందని, యాక్షన్ మూవీలో పొలిటికల్ డ్రామా బాగా పండిందని, శంకర్ ఈజ్ బ్యాక్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఇక, రామ్ చరణ్.. అప్పన్న, రామ్ నందన్ క్యారెక్టర్లో అదరగొట్టాడని, ముఖ్యంగా అప్పన్న పాత్రలో చెర్రీ జీవించేశాడని అంటున్నారు. యాక్టింగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లవ్ స్టోరీ అంతగా ఇంట్రెస్టింగ్ లేకపోయిన్ యాక్షన్ సీన్స్ ఎక్కగా ప్రేక్షకుడిని బోర్ కొట్టనీయకుండా చేశాయి. అంజలి, కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య యాక్టింగ్ ఇరగదీశారు. రామ్ చరణ్‌కు డబుల్ సపోర్ట్ గా నిలిచారు. దీంతో పాటు శ్రీకాంత్, సముద్రఖని కూడా వారి పాత్రలో మెప్పించారు. అలాగే సినిమాలో ఎమోషన్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సూపర్ అంటూ కొంతమంది కామెంట్స్ చేయగా.. రామ్ చరణ్ లుంగీ గెటప్, ఫెర్ఫార్మెన్స్, డైలాగ్స్, సాంగ్స్ మరో లెవల్ తీసుకెళ్లేలా అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు.
సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, తమన్ తన సంగీతంతో మరోసారి ఆకట్టుకున్నాడు. బీజీఎం చాలా బాగుందని, ప్లాష్ బ్యాక్ సీన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న పాత్రలో రామ్ చరణ్‌ను ఎప్పుడూ చూడని విధంగా చేశారు. ఈ సినిమాకు అదే బేస్ పాయింట్ కానుంది. ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ కానుంది. మొత్తానికి ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#GameChanger Review
Decent Political Drama
#RamCharan & #SJSuryah were terrific
Rest of the cast were good too
Visuals
Some Scenes In 2nd Half
Screenplay
Songs Visuals
Story
Rating:
/5#GameChangerReview #KiaraAdvani #Shankar pic.twitter.com/5kcgKMYdQw
— Swayam Kumar Das (@KumarSwayam3) January 9, 2025
Game Changer:
CAREER CHANGER
Shankar has given a comeback with remarkable film that blends engaging storytelling, stellar performances, and top-notch technical elements to create an immersive cinematic experience. He masterfully handled the transitions between… pic.twitter.com/KExTTKuxrJ
— Manobala Vijayabalan (@ManobalaV) January 9, 2025