Published On:

R. Madhavan: అప్పుడు మణిరత్నం గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ కూడా గుర్తుపట్టలేదు

R. Madhavan: అప్పుడు మణిరత్నం గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ కూడా గుర్తుపట్టలేదు

R. Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్ తెలుగువారికి కూడా సుపరిచితుడే. మ్యాడీగా ఆయన ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. రన్, సఖి, చెలి లాంటి సినిమాలతో తెలుగువారికి కూడా మాధవన్ పరిచయం అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాధవన్.. ఒక సినిమా కోసం చాలా కష్టపడినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ సినిమానే యువ.

 

స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యువ. సూర్య, సిద్దార్థ్, మాధవన్, త్రిష, మీరా జాస్మిన్, ఈషా డియోల్ కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన పండితుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

 

యువ సినిమా అనగానే టక్కున అందరి మదిలో సూర్య కన్నా మాధవన్ పాత్రనే గుర్తుకు వస్తుంది. గుండుతో రఫ్ గా రౌడీగా కనిపించే ఆ పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. ఈ పాత్ర కోసం మణిరత్నం చాలా కష్టపడినట్లు మాధవన్ చెప్పుకొచ్చాడు. ” యువ కథ విన్నప్పుడు నేను మొదట సాంబ పాత్రనే చేస్తాను అన్నాను. ఎందుకు అన్నారు. ఈ పాత్ర జీవితాంతం ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోతుందని చెప్పా. ఆయన నన్ను సిద్దార్థ్ పాత్ర కోసం పిలిచాను అని చెప్పారు. నేను చెప్పిన మాటలకుఆయన సంతృప్తి చెందలేదు.

 

మణిరత్నతో నాకు కొంచెం టైమ్ ఇవ్వండి అని చెప్పి వచ్చేశాను. ఆ తరువాత గుండు కొట్టించుకున్నాను. సన్ స్క్రీన్ లేకుండా కొన్నిరోజులు గోల్ఫ్ ఆడాను. ముఖం మొత్తం  రంగు మారింది. ఆ తరువాత మణిరత్నం ఆఫీస్ కు వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ నన్ను గుర్తుపట్టకుండా ఆపేశాడు. లోపలి వెళ్లి మణిరత్నంతో.. సర్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అన్నాడు. ఆయన బయటకు వచ్చి దూరంగా ఉన్న నన్ను చూసి ఎవరీ వ్యక్తి అనుకోని.. దగ్గరకు వచ్చి ఫక్కున నవ్వేశారు.

 

ఏంటి ఇప్పుడు నన్ను ఆ పాత్రకు తీసుకుంటారా.. ? అని అడిగాను. ఆ పాత్రకు సంబంధించి మొత్తం కథను చెప్పమని అడిగాను. ఆ క్యారెక్టర్ ను అర్ధం చేసుకోవడానికి నాకు జియోగ్రఫీ ఛానెల్ లో ఒక సీన్ కారణం. ఒక పులి.. జింకలను వేటాడేటప్పుడు చాలా శ్రద్దగా చూస్తుంది. అస్సలు కోపాన్ని ప్రదర్శించవు.జింకల గుంపుపై దూకుతూ గొంతు పట్టేస్తాయి. ఎందుకంటే వాటి ఆహరం కోసం తప్పదు కాబట్టి.  అలానే ఈ సినిమాలో సాంబ పాత్ర కూడా అంతే” అని చెప్పుకొచ్చాడు.