Published On:

Single Movie: శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక.. శ్రీవిష్ణు సాంగ్ భలే ఉందే

Single Movie: శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక.. శ్రీవిష్ణు సాంగ్ భలే ఉందే

Single Movie: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు.. ఈ ఏడాది సింగిల్ అంటూ వస్తున్నాడు. కార్తీక్ రాజు దర్శకత్వంలో శతెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్, కళ్య బ్యానర్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్  & రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తిని పెంచాయి. టైటిల్ సింగిల్ అని పెట్టి.. ఇద్దరు భామలతో హీరో ప్రేమాయణం నడపడం చూపించడంతో ఇదేదో కొత్త స్టోరీలా ఉందని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఇక తాజాగా సింగిల్ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎంతో స్మూత్ గా వినడానికి హాయిగా ఉంది. ఇక వీడియోలో హీరో.. ఇద్దరు హీరోయిన్లతో ప్రేమలో పడడం.. వారితో కలిసి ప్రయాణించడం లాంటివి చూపించారు.

 

ఇద్దరు హీరోయిన్లు కూడా హీరో గురించి ఆలోచించడం.. అతనితో కలిసి డ్యాన్స్ వేయడం చూపించారు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను సింగర్ యాజీన్ నజీర్ తన వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా తమ అందంతో కట్టిపడేస్తే.. శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టేశాడు. మొదటి సాంగ్ తోనే మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.