Published On:

Spirit Shooting: ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ షూటింగ్‌ అప్‌డేట్‌ – సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే..!

Spirit Shooting: ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ షూటింగ్‌ అప్‌డేట్‌ – సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే..!

Prahas and Sandeep Reddy Vanga Spirit Update: డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చేతిలో అరడజనుపైగా చిత్రాలు ఉన్నాయి. అన్ని కూడా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్సే. తీరిక లేకుండ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ది రాజా సాబ్‌, సలార్‌ 2, కల్కి 2 చిత్రాలతో పాటు హను రాఘపూడితో ఫౌజీ చేస్తున్నాడు. త్వర త్వరగా షూటింగ్స్‌ పూర్తి చేస్తూ తదుపరి ప్రాజెక్ట్స్‌ సెట్స్‌పైకి తీసుకువస్తున్నాడు.

 

వీటీతో పాటు సందీప్‌ రెడ్డి వంగతో స్పిరిట్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రెండేళ్ల క్రితమే ప్రకటన వచ్చింది. అప్పటికే ప్రభాస్‌ చేతిలో కల్కి 2898 ఏడీ, సలార్‌ వంటి భారీ సినిమాలు చేస్తున్నాడు. దీంతో సందీప్‌ రెడ్డి వంగా రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ మూవీ తెరకెక్కించి విడుదల కూడా చేశాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్. ప్రస్తుతం ప్రభాస్‌ స్పిరిట్‌ స్క్రిప్ట్‌ వర్క్‌పై ఫోకస్‌ పెట్టాడు. అదే విధంగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అయితే తాజా బజ్‌ ప్రకారం సందీప్‌ రెడ్డి వంగా స్క్రిప్ట్‌ పూర్తి చేశాడట.

 

దీంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను చకచక పూర్తి చేసి మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే జూన్‌లో స్పిరిట్‌ను షూటింగ్‌ ప్రారంభించేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తున్నట్టు నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. ఇక సినిమా కోసం ప్రభాస్‌ మేకోవర్‌ అవుతున్నాడు. పోలీసు ఆఫీసర్‌ పాత్రకు తగ్గట్టుగా తన బాడీ, హెయిర్‌ స్టైల్‌ని మార్చుకుంటున్నాడట.

 

ఇక ఇప్పటి వరకు మాస్‌ లుక్‌, లవర్‌ బాయ్‌గా కనిపించిన డార్లింగ్‌ ఫస్ట్‌ టైం పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. దీంతో ప్రభాస్‌ ఆ పాత్రలో చూసేందుకు అభిమానుంత తెగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉంటుంది, పోలీసు ఆఫీసర్‌గా ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడా? ఫ్యాన్స్‌ అంతా ఊహాల్లో తేలిపోతున్నారు. కాగా ఇంటెన్సిటీ యాక్షన్, థ్రిల్లర్‌ జానర్‌లో స్పిరిట్‌ మూవీని తెరకెక్కించబోతున్నాడు సందీప్‌ రెడ్డి వంగా.

ఇవి కూడా చదవండి: