TGPSC Group-1: టీజీపీఎస్‌సీకి హైకోర్టు బిగ్ షాక్.. గ్రూప్-1 నియామకాలు నిలిపివేత

Telangana High Court big shock to TGPSC Key Orders On Group-1 Recruitments: టీజీపీఎస్‌సీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాలను నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రూప్-1 నియామకాల విషయంలో విచారణ ముగిసే వరకు గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకూడదని టీజీపీఎస్‌సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలెక్ట అయిన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మాత్రమే చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌నను టీజీపీఎస్‌సీ ప్రకటించింది. వాస్తవానికి నేటి నుంచి 21వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగునుంది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరగనుంది.
ఇందులో భాగంగానే గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటటు రెండు పాస్ పోర్టు ఫొటోలను తీసుకురావాలని సూచించింది. అలాగే వాటిపై అభ్యర్థుల సంతకాలు చేసి వెరిఫికేషన్‌కి రావాని పేర్కొంది.