Samsung Galaxy M56 5G: ట్రిపుల్ కెమెరా.. సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy M56 5G: టెక్ దిగ్గజం మరో కొత్త మొబైల్ విడుదల చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఇటీవలే Samsung Galaxy M06 5G, Samsung Galaxy M16 5G ఫోన్‌లను పరిచయం చేసింది. బ్రాండ్ తన గెలాక్సీ ‘M’ సిరీస్‌ను విస్తరించింది. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌కి మరో కొత్త ఫోన్‌ను జోడించనుంది. మొబైల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ 5G ఫోన్ విడుదల తేదీ, ఫోటోలు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy M56 5G Launch Date
ఈ మొబైల్ ఏప్రిల్ 17న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ మొబైల్ మైక్రోసైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో లైవ్ అవుతుంది. ఇక్కడ Samsung Galaxy M56 5G విడుదల తేదీతో పాటు, ఈ 5G ఫోన్ అన్ని వివరాలు కూడా వెల్లడయ్యాయి. రాబోయే సామ్‌సంగ్ మొబైల్ ధరను ఏప్రిల్ 17న ప్రకటిస్తారు.
Samsung Galaxy M56 5G Features
M56 5G ఫోన్ డిస్‌ప్లే పంచ్ హోల్ స్టైల్‌లో ఉంటుంది. దీనికి విజన్ బూస్టర్ టెక్నాలజీ ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ 33 శాతం ఎక్కువ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ మొబైల్ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ ఉంది. ఇది ఫోన్‌ను సురక్షితంగా ఉంచుతుంది. ఈ ఫోన్ మందం కేవలం 7.2 మిమీ, బరువు కేవలం 180 గ్రాములు మాత్రమే అని కంపెనీ తెలిపింది.
Samsung Galaxy M56 5G Camera
M56 5G మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, LED ఫ్లాష్ తో వస్తుంది. దీనితో పాటు, రెండవ కెమెరాలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ , తృతీయ కెమెరాలో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ సామ్‌సంగ్ 5G ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 10-బిట్ హెచ్‌డీఆర్ కంటెంట్‌ను కూడా రికార్డ్ చేయగలదు.
Samsung Galaxy M56 5G Battery And Processor
సామ్‌సంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ కంపెనీ Exynos 1480 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ సామ్‌సంగ్ 5G ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 8GB RAM తో విడుదల అవుతుంది. 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు.