Published On:

Smaran Ravichandran joins in SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కీలక ప్లేయర్.. ఇక దబిడి దిబిడే!

Smaran Ravichandran joins in SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కీలక ప్లేయర్.. ఇక దబిడి దిబిడే!

Smaran Ravichandran joins Replacement of Adam Zampa Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో భారీగా గెలుపొందింది. ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్‌ల్లో వరుసగా 4 మ్యాచ్‌లు ఓడింది. చివరగా ఆడిన పంజాబ్‌తో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక, పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది.

 

కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టులోకి కీలక ప్లేయర్ ఎంట్రీ ఇస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో స్మరన్ రవిచంద్రన్ ఆడనున్నాడు. గాయం కారణంగా ఆడమ్ జంపా తర్వాతి మ్యాచ్‌లకు దూరమవుతున్న నేపథ్యంలో స్మరన్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్‌ను రూ.30 లక్షలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 7 ఫస్ట్ ఆఫ్ మ్యాచ్‌లు ఆడిన స్మరన్.. పంజాబ్‌పై డబుల్ సెంచరీ నమోదు చేయడంతో పాటు 64.50 సగటుతో 500లకు పైగా పరుగులు చేశాడు. 2024లో అరంగేట్రం చేసిన స్మరన్.. 10 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో రెండు సెంచరీలతో 72.16 సగటుతో 433 పరుగులు చేశాడు. అలాగే 6 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 170 స్ట్రైక్ రేటుతో 170 పరుగులు చేశాడు.