IPL 2025 : టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న అయ్యర్

IPL 2025 : ఐపీఎల్ 118వ సీజన్‌లో పాయింట్ల పట్టిలో అట్టుడుగున ఉంది. తాజాగా హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుతో ఉంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
చావోరేవో పోరులో కెప్టెన్ కమిన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాడు. కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. పంజాబ్ జట్టు ఏ మార్పు లేకుండా మ్యాచ్ ఆడనుంది. 23 మ్యాచుల్లో హైదరాబాద్ 16 విజయాలతో పంజాబ్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈసారి అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ పటిష్టంగా ఉంది.
హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, షమీ, ఈషన్ మలింగ ఉన్నారు.
పంజాబ్ జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేర, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, చాహల్ ఉన్నారు.