Actress Vincy Sony Aloshious: డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో – సెట్లో అందరి ముందే నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!

Malayalam Actress Vincy Sony Says Star Hero Who Drugged Misbehaviour With Her: ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. మహిళలపై లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుతో మలయాళ ఇండస్ట్రీ గురించి అంతా చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి నటీమణులు ఆరోపణలు కూడా ఎక్కువైపోయాయి. తరచూ ఎవరోకరు బయటకు వచ్చి తోటి నటుల వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు.
డ్రగ్స్ తీసుకునే నటులతో నటించను..
తాజాగా మరో మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ బయటకు వచ్చి ఓ స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది. పేరున్న పెద్ద హీరో మూవీ సెట్‌లో అందరి ముందే తనతో అనుచితంగా ప్రవర్తించారని చెప్పింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇకపై తాను డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నటించోద్దని నిర్ణయించుకున్నానంది. ఆమె చేసిన ఈ కామెంట్స్‌కి నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఇందులో ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్ మత్తులో ఓ హీరో తనదో అసభ్యకరంగా ప్రవర్తించారని, అదోక అసహ్యకరమైన సంఘటన అంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. “నేను ఈ వీడియో చేయడానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో నేను చేసిన కామెంట్స్‌పై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని నేను క్లియర్ చేయాలనుకుంటున్న. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ‘ఇటీవల నేను నటించిన ఓ సినిమా హీరో షూటింగ్‌లో డ్రగ్స్ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నని రోజులు అతడి వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఒక రోజు షూటింగ్‌లో నా డ్రస్ కాస్తా అన్‌కంఫర్ట్‌గా ఉంది. ఆ విషయాన్ని అతడు నాతో చెప్పాడు. సరే మార్చుకుని వస్తానని క్యారవాన్ వైపు వెళుతున్నాను.
అది నా జీవితంలో అసహ్యకరమైన సంఘటన..
అప్పుడతను పదా నేను కూడా నీతో వస్తాను అన్నాడు. తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బంది పెట్టాడు. షూటింగ్‌లో అందరి ముందే నాతో అలా అనేసరికి షాక్ అయ్యాను. ఎప్పుడు అతడి ప్రవర్తనకు ఎంతో ఇబ్బంది పడ్డాను. అది నా జీవితంలో జరిగిన అసహ్యకరమైన సంఘటన. ఆ తర్వాత కొన్ని రోజులకు అదే సినిమా సెట్‌లో ఆ హీరో నోటి నుంచి తెల్లని ప్రదార్థం బయటపడింది. అప్పుడే అతడు డ్రగ్స్ తీసుకుంటాడని అర్థమైంది. ఇక భవిష్యత్తులో డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నటించకూడదని నిర్ణయించుకున్న.
నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో నాకు సినిమాల అవకావాలు రాకపోవచ్చు. నాతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికి తెలుసు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు” అని వాపోయింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఆ హీరో పేరును విన్సీ వెల్లడించలేదు. 2019లో వికృతి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది విన్సీ. ఆ తర్వాత రేఖ, జనగణమన, సౌతి వెళ్లక్క, పద్మిని, పళజన్ ప్రణయం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి:
- Actress Abhinaya Marriage: నటి అభినయ పెళ్లి వేడుకలు – కాబోయే భర్తతో ఆమె అల్లరి చూశారా..? ఫోటోలు వైరల్