Published On:

Samsung Galaxy S23 Ultra Big Price Drop: బిగ్ ప్రైస్ డ్రాప్.. 200MP సామ్‌సంగ్ గెలాక్సీ S23 Ultra.. ఖరీదైన ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్!

Samsung Galaxy S23 Ultra Big Price Drop: బిగ్ ప్రైస్ డ్రాప్.. 200MP సామ్‌సంగ్ గెలాక్సీ S23 Ultra.. ఖరీదైన ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్!

Huge Discount on  Galaxy S23 Ultra Mobile: సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర మరోసారి తగ్గింది. సామ్‌సంగ్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. ఈ ఫోన్‌లో 200MP కెమెరాతో సహా AI ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా లాంచ్ తర్వాత, సామ్‌సంగ్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ చాలా చౌకగా మారింది. కంపెనీ తన స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఫోన్ ధరను గణనీయంగా తగ్గించింది.

 

Samsung Galaxy S23 Ultra Offers
ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో దాని 12GB RAM + 512GB వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను దాని లాంచ్ ధర కంటే రూ.50,000 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దాని 12GB RAM + 256GB, 12GB RAM + 512GB వేరియంట్లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సామ్‌సంగ్ ఫోన్ రూ.1,49,999కి లాంచ్ అయింది. 43శాతం డిస్కౌంట్ తర్వాత, ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.84,999గా ఉంది.

 

ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై 5శాతం తగ్గింపు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ఈ ఫోన్ కొనుగోలుపై మొత్తం 48శాతం వరకు తగ్గింపు పొందచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 512GB వేరియంట్ రూ.1,61,999 ధరకు ప్రారంభించారు. ఈ వేరియంట్ కొనుగోలుపై రూ. 50,000 బంపర్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిని రూ.1,11,000 కు కొనుగోలు చేయచ్చు. దీనితో పాటు, ఫోన్ కొనుగోలుపై రూ.27,350 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.

 

Samsung Galaxy S23 Ultra Features and Specifications
సామ్‌సంగ్ నుండి వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 6.81-అంగుళాల 2X డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కాకుండా, ఫోన్ LTPOకి కూడా సపోర్ట్ ఇస్తుంది. అలానే 120Hz హై రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ చేసింది, దీనితో 12జీబీ ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్ లభిస్తుంది. 45W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌‌తో 5000mAh బ్యాటరీ అందించారు.ఈ ఫోన్ Android 13 ఆధారంగా OneUI 5లో పనిచేస్తుంది, దీనిని కొత్త OSకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ
స్మార్ట్‌ఫోన్‌లో ఎస్-పెన్ సపోర్ట్ అందించారు.

 

Samsung Galaxy S23 Ultra Camera Features
గెలాక్సీ S23 అల్ట్రా వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 200మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనితో పాటు, 10మెగాపిక్సెల్, 12మెగాపిక్సెల్, 10మెగాపిక్సెల్ గల మరో మూడు కెమెరాలు అందించారు. ఫోన్ మెయిన్ కెమెరా OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12మెగాపిక్సెల్ కెమెరా ఉంది.