Hit 3 Trailer Breaks RRR Record: రాజమౌళి షాకిచ్చిన హిట్ 3 ట్రైలర్.. బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్!

Nani HIT 3 Trailer Breaks Rajamouli’s Baahubali 2 and RRR Records: హీరో నాని నటిస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేసు’ (HIT 3). హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌ని సస్పెన్స్ థ్రిల్లింగ్‌తో రూపొందించారు. కానీ, మూడో భాగాన్ని ఫుల్ యాక్షన్, క్రైం థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మే 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న హిట్ 3 ట్రైలర్ (HIT 3 Trailer)ని రిలీజ్ చేశారు. ఇందులో నాని ఫుల్ వయోలెంట్‌గా కనిపించాడు.
అర్జున్ సర్కార్ గా నాని
ట్రైలర్ మొత్తం చంపడం, నరకడం, రక్తం ఏరులైపాలడం వంటి సన్నివేశాలతో రూపొందించిన భయపెట్టారు. నాని అర్జున్ సర్కార్‌గా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించి అందరికి షాకిచ్చాడు. క్రైం, ఎమోషనల్ సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. దీంతో ట్రైలర్ ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా ఈ ట్రైలర్ రాజమౌళి సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే హిట్ 3 ట్రైలర్ 23.1 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో రాజమౌళి బాహుబలి 2 (21.81 మిలియన్), ఆర్‌ఆర్‌ఆర్ (24.45 మిలియన్) వ్యూస్‌ని బ్రేక్ చేసింది.
హిట్ 3 ట్రైలర్ రికార్డ్స్ ఇవే
అదే విధంగా ప్రశాంత్ నీల్ కేజీయఫ్ రికార్డును కూడా నాని బీట్ చేశాడు. కేజయఫ్ 2 ట్రైలర్ (19.38 మిలియన్ వ్యూస్) వంటి రికార్డును కూడా నాని హిట్ 2 ట్రైలర్ బ్రేక్ చేసి సర్‌ప్రైజ్ చేసింది. ఈ రికార్డ్స్ కేవలం తెలుగు వెర్షన్‌తో బ్రేక్ చేయడం విశేషం. దీంతో నాని ఈ క్రిడెట్ అంతా నానికే ఇస్తున్నారు. మొన్నటి వరకు హోమ్లీ కుర్రాడిగా కనిపించిన నాని దసరా నుంచి తన మాస్ అవతారంతో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. బి గ్రేడ్ హీరోల జాబితాలో ఉన్న నాని సినిమా.. సినిమాకు తనని తాను మేకోవర్ చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడ హిట్ 3తో మరోసారి నాని పుల్ వయెలెన్స్‌తో థియేటర్లలో దద్దరిల్లేలా చేయబోతున్నాడు.
నాని మేకోవర్ అదుర్స్
దీంతో నాని మేకోవర్ చూసి అభిమానులతో పాటు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కాగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అడివి శేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇక మే 1న వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. నాని హోం బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Urvashi Rautela Post on Tamanna Song: తమన్నా వర్సెస్ ఊర్వశి రౌతేలా – తేరా నషాపై నటి షాకింగ్ పోస్ట్, అంతలోనే డిలీట్!