Published On:

Mad Square Song Out: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ – నా ముద్దు పేరు స్వాతిరెడ్డి ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

Mad Square Song Out: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ – నా ముద్దు పేరు స్వాతిరెడ్డి ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

Mad Square Movie Swathi Reddy Full Video out Now: రీసెంట్‌ సూపర్‌ హిట్‌ కామెడీ ఎంటర్‌టైన్‌ మ్యాడ్‌ స్క్వేర్‌ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. యుత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ బాగా అలరించింది. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. 2023లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన మ్యాడ్‌ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రమిది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించింది.

 

తాజాగా ఈ సినిమాలో నుంచి ఓ క్రేజీ సాంగ్‌ను విడుదల చేసింది మూవీ టీం. స్వాతి రెడ్డి అంటూ సాగే ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఇందులో రెబా మోనికా జాన్‌ తన గ్లామరస్‌ లుక్‌, క్రేజీ డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ పాటలో రామ్‌ నితిన్, నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌ సైతం ఆడి పాడారు. తమదైన స్టెప్పులతో ఆడియన్స్‌ని ఫిదా చేశారు. అసలు హీరోయినే లేకుండ తీసిని ఈ సినిమాలో రెబా మోనికా జాన్‌తో పాటు ప్రియాంక జువాల్కర్‌ సైతం ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. అంతేకాదు పలు కీలక సన్నివేశాల్లోను నటించి మెప్పించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ సమర్సణలో సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా భీమ్స్‌ సిసిరోలి సంగీతం అందించాడు.

 

 

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ పార్ట్ నర్ ఇదే..

కాగా థియేటర్లలో మంచి విజయం సాధించిన మ్యాడ్‌ స్క్వేర్‌ మూవీ విడుదలకు ముందే ఓటీటీ ఢిల్‌ పూర్తి చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ తీసుకుంది. ఈ విషయాన్ని రిలీజ్‌కు ముందే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఒప్పందం ప్రకారం థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత లేదా రిలీజైన నెల రోజులకే విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఏప్రిల్‌ చివరి వారంలో లేదా మే ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీరి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక త్వరలోనే మ్యాడ్‌ స్క్వేర్‌ ఓటీటీ రిలీజ్‌, స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.