IPL 2025 27th Match: అభిషేక్ విధ్వంసం.. పంజాబ్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ!

Sunrisers won by 8 wickets against Punjab in IPL 2025 27th Match: ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన 27వ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ విధించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 9 బంతులు మిగిలిఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ వరుసగా 4 పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(82) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో స్లాయినిస్ (34) వేగంగా ఆడడంతో పంజాబ్ 245 పరుగులు చేసింది. అంతకుముందు ఓపెనర్లు ఆర్య(36), ప్రభ్‌సిమ్రన్(42), వధేరా(27) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు.
246 పరుగుల భారీ లక్ష్యఛేదనను సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టర్లతో తన బలమేంటో మరోసారి చూపించింది. కొండం లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(66), అభిషేక్ శర్మ(141) విధ్వంసం చేశారు. అభిషేక్ కేవల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 40 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సమయంలో అభిమానుల దృష్టి ఆయనపై పడింది. జేబులోంచి ఓ కాగితం తీసి అందరి వైపు చూపించాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అని అందులో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.