Published On:

Urvashi Rautela Post on Tamanna Song: తమన్నా వర్సెస్‌ ఊర్వశి రౌతేలా – తేరా నషాపై నటి షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే డిలీట్‌!

Urvashi Rautela Post on Tamanna Song: తమన్నా వర్సెస్‌ ఊర్వశి రౌతేలా – తేరా నషాపై నటి షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే డిలీట్‌!

Urvashi Rautela Shared Post And Delete on Tamannaah Tera Nasha: బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్‌ తేరా నషా పాటపై ఆమె చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసి ఆ వెంటనే దానికి డిలీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకి అదేంటంటే.. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఊర్వశీ రౌతేలా హిందీలోని పలు ప్రైవేట్‌ ఆల్బమ్‌లో నటించి గుర్తింపు పొందింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన ఆమె తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.

 

తెలుగు సాంగ్స్ తో క్రేజ్

కొంతకాలం సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం తెలుగులో వరుసగా ఐటెం సాంగ్స్‌ చేస్తూ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. రీసెంట్‌గా ‘డాకు మహారాజ్‌’లో బాలయ్య సరసన ‘దబిడి దిబిడి’ ఐటెంలో సాంగ్‌లో నటించి వైరల్‌ అయ్యింది. ఈ పాట ఎంత వైరల్‌ అయ్యిందో అదే స్థాయిలో వివాదంలోనూ నిలిచింది. అయితే తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసి మరోసారి వివాదంలో నిలిచింది. హిందీలో సన్నీ డియోల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన జాట్‌ మూవీలో ఊర్వశీ ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ‘సారీ బోల్‌’ అంటూ సాగే ఈ పాటకు ఆడియన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుంది. మరోవైపు తమన్నా.. తేరా నషా పాట యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది.

 

తమన్నా సాంగ్ పై విమర్శలు..

ఇటీవల విడుదలైన ఈ సాంగ్‌ తమన్నా తన అదిరిపోయే స్టెప్స్‌తో, హాట్‌లుక్‌లో ఫిదా చేస్తోంది. అలాగే సారీ బోల్‌లో ఊర్వశీ కూడా తనదైన స్టెప్స్‌, గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటుంది. ఇది పాట చూసిన ఓ నెటిజన్‌ ఇలా కామెంట్స్‌ చేశారు. “ఈ పాట తమన్నా తేరా నషా కంటే బెటర్‌ అనిపిస్తుంది” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ కామెంట్‌ని స్క్రిన్‌ షాట్‌ తీసి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. అయితే కాసేపటికే ఈ పోస్ట్‌ డిలీట్‌ చేసింది. కారణమేంటో తెలియదు కానీ, ఈ పోస్ట్‌ డిలీట్‌ చేయడంతో ఆమె తీరుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.  ఊర్వశీకి తల పోగరు పెరిగిందని, ఒక్క హిట్ కే ఓవర్‌ యాక్షన్‌ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

గతంతో కియారాపై కామెంట్స్

ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. ఇటీవల డాకు మహారాజ్‌ హిట్‌ తర్వాత ఊర్వశీ.. కియార అద్వానీతో పోల్చుకుంటు షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. “నేను నటించిన డాకు మహారాజ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. బాక్సాఫీసు వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అదే కియార అద్వానీ నటించిన గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌గా అయ్యింది” కామెంట్స్‌ చేసింది. దీంతో ఊర్వశీపై కియార, మెగా అభిమానులు అసహనం చూపించారు. ఆమె కేవలం ఐటెం సాంగ్‌లో మాత్రమే నటించింది. ఒక్క హిట్‌కే కళ్లు నెత్తికి ఎక్కించుకుంటుంది. కియారా ఓ స్టార్ హీరోయిన్‌, ఆమె ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించింది” అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.