Published On:

NTRNeel Big Update: బిగ్‌ అప్‌డేట్‌ – ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఎప్పుడంటే!

NTRNeel Big Update: బిగ్‌ అప్‌డేట్‌ – ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఎప్పుడంటే!

NTRNeel Movie Release Date Announced: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీర్‌, ప్రశాంత్‌ నీల్‌ (NTRNeel Movie) మూవీకి సంబంధించిన ఓ బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవలె సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై అప్పుడే ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ తాజాగా మూవీ మేర్స్‌ ఓ ట్వీట్ వదిలారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌, దేవర లాంటి హిట్‌ చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రమిది. పైగా కేజీయఫ్‌, సలార్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ప్రకటనతో ఈ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఎప్పుడే మూడేళ్ల క్రితమే ఈ సినిమాను ప్రకటించిన ఈ సినిమా గతేడాది పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి మూవీ షూటింగ్‌ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. ఏప్రిల్‌ 22 నుంచి తారక్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇలా సెట్‌లో అడుగుపెట్టాడో లేదో అప్పుడే మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది 2006 జూన్‌ 25న వరల్డ్‌ వైడ్‌ విడుదల చేస్తున్నట్టు తాజాగా నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇది తెలిసి అభిమానులంత పండగా చేసుకుంటున్నారు.

 

మూవీ షూటింగ్‌ మొదలైంది మొన్ననే, ఇంకా టైటిల్‌ కూడా ఫిక్స్‌ కాలేదు. కానీ, మూవీ టీం అప్పుడే రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో నీల్‌ మామ కాన్ఫిడెన్స్‌ని కొనియాడుతున్నారు. అది ప్రశాంత్‌ నీల్‌ మావ అంటే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను కోల్‌కత్త బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగనుందట. ఈ మేరకు ఓల్డ్‌ కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్‌ను కూడా వేసింది మూవీ టీం.

 

అక్కడే ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 22న తారక్‌ ఎన్టీఆర్‌నీల్‌(NTRNeel) సెట్‌లో అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా ముందుకు సాగనుంది. ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇదే ఫిక్స్‌ అన్నట్టుగా ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన సప్తసాగరాలు ఫేం రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌ నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.