Last Updated:

Miss Shetty Mr Polishetty : ఓటీటీ లోకి నవీన్ పోలిశెట్టి, అనుష్క హిట్ మూవీ.. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేయగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నవీన్ పోలిశెట్టి..

Miss Shetty Mr Polishetty : ఓటీటీ లోకి నవీన్ పోలిశెట్టి, అనుష్క హిట్ మూవీ.. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

Miss Shetty Mr Polishetty : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేయగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నవీన్ పోలిశెట్టి.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి సినిమాలతో భారీ హిట్స్ కొట్టగా ఈ సినిమాతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

నవీన్ కెరీర్ లో 50 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో జీవించారని చెప్పాలి. ఫుల్ లెంగ్త్ కామెడీ, క్యూట్ లవ్, క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాలతో అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించారు. అమెరికాలో కూడా దాదాపు 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఈ చిత్రం వసూలు చేసి దుమ్మురేపింది. కాగా థియేటర్స్ లో మంచి సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Miss Shetty Mr Polishetty

 

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేసేయండి.