Robin Hood Movie OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న నితిన్ రాబిన్ హుడ్ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Robin Hood Movie OTT Release and Streaming Details: నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ డిటైయిల్స్ ఆసక్తిగా మారాయి.
ఓటీటీకి రాబిన్ హుడ్?
రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన తాజాగా అప్‌డేట్ బయటకు వచ్చింది. భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నితిన్-వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన చిత్రమిది కావడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటిస్తుండటంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్‌కు ముందే విభిన్నంగా ప్రమోషన్స్ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది మూవీ టీం. ఈ నేపథ్యంలో మూవీ మంచి అంచనాలు నెలకొన్నాయి.
భీష్మ తరహాలో ఆకట్టుకోలేకపోయిన కాంబో
అలా థియేటర్లలోకి వచ్చిన రాబిన్ హుడ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రమోషన్స్‌లో తెగ ప్రచారం చేసింది మూవీ టీం. కానీ, ఆ రేంజ్‌లో సినిమాలోని కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎన్నో అంచనాలతో వెళ్లిన ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దీంతో బాక్సాఫీసు వద్ద డివైడ్ టాక్ అందుకుంది. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రాబిన్ హుడ్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5(Zee5) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మూవీ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు తీసుకున్నట్టు సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోబోతోంది.
అప్పుడే డిజిటల్ ప్రీమియర్
ఒప్పందం ప్రకారం జీ5 సంస్థ అతి త్వరలోనే రాబిన్ హుడ్ డిజిటల్ ప్రీమియర్‌కు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుందట. మే 2న ఈ సినిమా ఓటీటీకి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సదరు సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్‌లు ఈ సినిమా నిర్మించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శుభలేక సుధాకర్ వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రంలోనే క్రికెట్ డేవిడ్ వార్నర్ సినీరంగ ప్రవేశం చేయడం, అదీ కూడా తెలుగు చిత్రంతోనే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
- Trisha About Marriage: వివాహంపై నమ్మకం లేదు – నాకు అలాంటి పరిస్థితి వద్దు.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్