Last Updated:

Ghaati Movie: దేవసేన రావడం లేదు కానీ.. ఆ ప్లేస్ లో అవంతికను పంపిస్తుందంట

Ghaati Movie: దేవసేన రావడం లేదు కానీ.. ఆ ప్లేస్ లో అవంతికను పంపిస్తుందంట

Ghaati Movie: లేడీ సూపర్ స్టార్ అనుష్క ఏడాదికో సినిమా చేస్తూ వస్తుంది. అంతకుముందులా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ.. గతేడాది రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఘాటీ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. 

 

ఇప్పటికే ఘాటీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ చూడని పాత్రలో అనుష్క కనిపించింది. విలన్స్ తలలు కూరగాయలు కోసినట్లు కోస్తూ ప్రేక్షకులను బెంబేలెత్తించింది. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 18 న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు.

 

వచ్చే నెలలో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు చిత్రబృందం ఒక్క ప్రమోషన్ చేసింది కూడా లేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఏప్రిల్ 18 న రిలీజ్ అవ్వడానికి చిన్న సినిమాలు క్యూ కడుతున్నట్లు సమాచారం. ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం, తమన్నా ఓదెల 2 ఆ రోజు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ రెండు సినిమాలు కూడా మంచి హైప్ తో వస్తున్నవే. కోర్ట్ సినిమాతో ప్రియదర్శి మళ్లీ హిట్ కొట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అతడే కనిపిస్తున్నాడు. దీంతో అతని తదుపరి చిత్రం సారంగపాణి జాతకంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఓదెల 2 .. తమన్నా నటిస్తున్న ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్  అంచనాలు పెట్టుకున్నారు.

 

ఇప్పటికే ఓదెల సినిమా హిట్ అవ్వడం.. దానికి సీక్వెల్ గా ఓదెల 2 రావడం.. అందులోనూ ఈ మధ్య మహాకుంభమేళాలో టీజర్ ను రిలీజ్ చేసి.. ప్రేక్షకులను అలరించారు. ఒకవేళ ఘాటీ అప్పుడు రిలీజ్ కాకపోతే ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మిస్టరీ గా మారింది. ఈ ఏడాది కూడా స్వీటీని చూడలేమని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.