Published On:

Chhaava OTT Release: టాలీవుడ్‌ ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్‌ – ఛావా తెలుగు వెర్షన్‌ వచ్చేసింది, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Chhaava OTT Release: టాలీవుడ్‌ ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్‌ – ఛావా తెలుగు వెర్షన్‌ వచ్చేసింది, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Chhaava Movie Telugu Version Now Streaming on This OTT: బాలీవుడ్‌ లెటస్ట్‌ హిట్‌ మూవీ ఛావా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 11న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీకి తీసుకువచ్చింది. అయితే చివరిలో ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే విడుదల చేసి తెలుగు ఆడియన్స్‌ షాక్‌ ఇచ్చింది. ఛావా ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న తెలుగు ఆడియన్స్‌కి నిరాశ చెందారు. అయితే తెలుగు వెర్షన్‌ కూడా రిలీజ్‌ చేస్తుందనే విషయం తెలిసిన, అది ఎప్పుడు వస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు.

 

తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది

ఛావా తెలుగు వెర్షన్‌ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈ మూవీని తెలుగు భాషలోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇది తెలిసి టాలీవుడ్‌ ప్రేక్షకులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ వీకెండ్‌లో ఓ యోధుడి గురించి తెలుసుకోబోతున్నామంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా నటించి ఈ సినిమా ప్రేమికుల దినొత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోతోనే ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. చరిత్రలోనే ఓ యోధుడి గురించి వెండితెరపై అద్భుతంంగా ఆవిష్కరించాడు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌.

 

ఛత్రపతి కొడుకు శంభాజీ కథ ఆధారంగా

మరాఠ రాజు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద ఛావా రికార్డు వసూళ్లు సాధించింది. దాదాపు రూ. 750పైగా కోట్లు గ్రాస్‌ చేసింది ఈ చిత్రం. ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో ఛావాలోనే తెలుగులో డిస్ట్రీబ్యూటీ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌. మార్చి 11న ఛావా తెలుగు వెర్షన్‌ థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. ఇక్కడ ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమాను ఓటీటీకి తీసుకువచ్చారు.

 

అయితే కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే స్ట్రీమింగ్ రావడంతో తెలుగు ఆడియన్స్‌ డిసప్పాయింట్‌ అయ్యారు. ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రావడంతో ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. భారత చరిత్రలో ఛత్రపతి శివాజీ గురించి ఉంది. కానీ ఆయన కుమారుడు గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే ఆయన కథను వెలికితీసి ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చాడు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేఖర్‌. శివాజీ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ఈ సినిమా దేశవ్యాప్తంగా టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా నిలిచింది.

ఛావా కథేంటంటే

ఛత్రపతి శిశాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించవచ్చని అనుకుంటాడు మొగల్‌ చక్రవర్తి జౌరంగాజేబు. శివాజీ మరణంతో మొగల్‌ సామ్రాజ్యంతో సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఆ రాజ్యంపై దండయాత్రకు వస్తాడు శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ (విక్కీ కౌశల్‌). మొగల్‌ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జౌరంగజేబు స్వయంగా రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున్న సైన్యంతో దక్కన్‌ ప్రాంతంపై దాడి పాల్పడతాడు. కేవలం పాతిక వేల సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ.. ఔరంగజేబు ఎలా ఎదుర్కున్నాడనేది ‘ఛావా’ కథ.