Published On:

Ghaati Movie: ఘాటీ నుంచి తప్పుకున్న క్రిష్.. గందరగోళంలో స్వీటీ ఫ్యాన్స్.. ?

Ghaati Movie: ఘాటీ నుంచి తప్పుకున్న క్రిష్.. గందరగోళంలో స్వీటీ ఫ్యాన్స్.. ?

Ghaati Movie: లేడీ సూపర్ స్టార్ అనుష్క గతః కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ.. అడపదడపా సినిమాలు చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేసినా.. స్వీటీ ఏడాదికి ఒక సినిమా అయినా చేస్తుంది చాలా అని సంతోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్వీటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఘాటీ.

 

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేదం సినిమాలో వేశ్యగా నటించిన అనుష్క.. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ఘాటీ కోసం వేశ్య పాత్రలో నటించబోతుంది. మునుపెన్నడూ చూడని స్వీటీని క్రిష్.. ఈ సినిమాలో చూపించాడు. విలన్ల పీక పట్టుకొని కత్తితో కోస్తున్న స్వీటీని చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోయారు.

 

ఇక ఆ టీజర్ చూసిన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 18 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, రిలీజ్ డేట్ వెళ్ళిపోయింది కానీ, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది లేదు అందుతున్న సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడం వలనే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క  ఘాటీ నుంచి కూడా క్రిష్ తప్పుకున్నాడన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.

 

మొదటినుంచి కూడా క్రిష్ కు మధ్యలో వెళ్లిపోవడం అలవాటుగా మారింది. మణికర్ణిక సినిమాను మొదలుపెట్టి యేవో సమస్యలు ఉన్నాయని మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆ తరువాత దానిని కంగనా పూర్తిచేసి రిలీజ్ చేసింది. ఇక ఈ మధ్య హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాడు. దీనికి కారణంగా ఘాటీ ప్రాజెక్ట్ ను చూపించాడు.

 

పవన్ డేట్స్ ఇవ్వకపోవడం వలన జాప్యం జరుగుతుందని, తన తదుపరి ప్రాజెక్ట్ ఘాటీ లేట్ అవుతున్న కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఘాటీ నుంచి కూడా క్రిష్ తప్పుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది.. ? అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే మేకర్స్ స్పందించేవరకు ఆగాల్సిందే.