Published On:

Karregutta: 15వ రోజుకు చేరిన కర్రెగుట్ట కూంబింగ్, చర్చలకు కడియం డిమాండ్

Karregutta: 15వ రోజుకు చేరిన కర్రెగుట్ట కూంబింగ్, చర్చలకు కడియం డిమాండ్

Karregutta: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆపరేషన్ 15వ రోజుకు చేరింది. బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలంలో కూంబింగ్ కొనసాగుతోంది. భూగర్భ బంకర్ల నుంచి..మావోయిస్టులు బయటకు వస్తున్నట్లు బలగాలు భావిస్తున్నాయి.

 

భద్రతాబలగాలు కూంబింగ్ జరుపుతున్నప్పుడు IED బాంబు పేలింది. ఈ ఘటనలో CRPF అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బోరాడేకు, మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే జవాన్లను విమానంలో ఢిల్లీకి తరలించారు. అయితే సాగర్ బోరాడే జవాన్ ఎడమ కాలికి తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కావడంతో అతని కాలును వైద్యులు తొలగించారు. ప్రస్తుతం సాగర్ బోరాడే వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

 

నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్ కౌంటర్ చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఎన్ కౌంటర్ల పేరుతో అడవిలో రక్తపు ఏరులు పారొద్దని కోరారు. ఎన్టీఆర్ హయాంలో స్వయంగా నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపించానని గుర్తు చేశారు. శాంతి చర్చలు జరపడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతని చెప్పారు. హైదరాబాదులో అందాల పోటీలు నిర్వహించడం వల్ల భారీగా పెట్టుబడి వచ్చే అవకాశంతో పాటు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందని కడియం శ్రీహరి అన్నారు.