Published On:

Gopichand New Movie: కొత్త డైరెక్టర్ నే నమ్ముకున్న గోపీచంద్.. ఈసారైనా హిట్ అందేనా?

Gopichand New Movie: కొత్త డైరెక్టర్ నే నమ్ముకున్న గోపీచంద్.. ఈసారైనా హిట్ అందేనా?

Gopichand New Movie Puja ceremony: మ్యాచో హీరో గోపీచంద్ ఎన్నో ఏళ్లుగా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. గతేడాది భీమా, విశ్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని అందుకున్నాడు. కథలు మంచిగా ఎంచుకుంటున్నా ఎందుకో గోపీచంద్ ను మాత్రం ప్రేక్షకులు ఆదరించడంలేదు. కొంతమంది అయితే.. ఈ హీరోగా సినిమాలు తీయడం మానేసి.. విలన్ గా సెట్ అవ్వమని కామెంట్స్ చేస్తున్నారు.

 

అయినా ఇలాంటివేమీ పట్టించుకొని గోపీచంద్.. ఇండస్ట్రీ పైన యుద్ధం చేస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ను నమ్మాడు. ఇక ఇప్పుడు కొత్త డైరెక్టర్ ను నమ్ముకొని ఒక సినిమా చేస్తున్నాడు.

 

తాజాగా గోపీచంద్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కుమార్ మిస్టిక్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమాతో మరో మలయాళ బ్యూటీ మీనాక్షీ  దినేశన్  తెలుగుకు పరిచయమవుతుంది.

 

ఇక గోపీచంద్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ” మేము మొదలుపెడుతున్నాం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ తో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుమార్ మిస్టిక్ కొత్తగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా కోసం గోపీచంద్ లుక్ మొత్తం మార్చనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ మంచి హిట్ ను అందుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.