Published On:

Shalini Pandey: ఆ డైరెక్టర్.. నేను బట్టలు మార్చుకుంటుంటే వచ్చి..

Shalini Pandey: ఆ డైరెక్టర్.. నేను బట్టలు మార్చుకుంటుంటే వచ్చి..

Shalini Pandey:  అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ షాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ సినిమా విజయ్ ను, షాలినిని ఓవర్ నైట్ స్టార్స్ ను చేసింది. బోల్డ్ క్యారెక్టర్ లో షాలిని ఎంతో అద్భుతంగా నటించింది.

 

అర్జున్ రెడ్డి సినిమా తరువాత షాలినిని ఫ్యాన్స్ ఇప్పటికీ ప్రీతీ అనే పిలుస్తారు. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోతుంది అని అనుకున్నారు. కానీ, ఈ చిన్నదాని బ్యాడ్ లక్.. ఒక్క సినిమా కూడా సరైనది పడలేదు. మహానటి, ఎన్టీఆర్  కథానాయకుడు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. ఆ  తరువాత పలు సినిమాల్లో నటించినా కూడా షాలినికి అంతగా గుర్తింపు అందలేదు. ఇక దీంతో చేసేది లేక.. అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ కోసమే బొద్దు భామ బరువు తగ్గి జీరో సైజ్ కు చేరుకొని షాక్ ఇచ్చింది.

 

ఇక బాలీవుడ్ లో మహారాజ్, డబ్బా కార్టెల్ లాంటి సిరీస్ తో అమ్మడు మంచి గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటున్న షాలిని.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను కెరీర్ మొదట్లో పడిన కొన్ని స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చింది. అందులో ఒక సౌత్ డైరెక్టర్ తన క్యారవ్యాన్ లోకి పర్మిషన్ అడగకుండా వచ్చాడని చెప్పి షాక్ ఇచ్చింది.

 

” నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. ఒక తెలుగు డైరెక్టర్.. డోర్ కూడా కొట్టకుండా క్యారవ్యాన్ లోకి వచ్చాడు. అప్పుడే నేను బట్టలు మార్చుకుంటున్నాను. అప్పుడు నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పటికే నా మొదటి సినిమా ఫినిష్ అయ్యింది.  కొత్త అమ్మాయివి.. ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు అని చెప్పారు. కానీ, ఆ సమయంలో నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా వయస్సు కేవలం 22 మాత్రమే.. అప్పుడు మాత్రం నేనొక సగటు అమ్మాయిని. అలా చేయడంతోనే అతనిని చెడామడా తిట్టేశాను” అని చెప్పుకొచ్చింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.

 

ఇక దీంతో నెటిజన్స్.. షాలిని వికీపీడియా ఓపెన్ చేసి ఆమె సినిమాల లిస్ట్ వెతుకుతున్నారు. సౌత్ డైరెక్టర్ అని చెప్పింది కానీ, తెలుగు, తమిళ్ అనో చెప్పలేదు. అర్జున్ రెడ్డి తరువాత షాలిని.. మేరీ నిమ్మో అనే హిందీ సినిమాలో నటించింది. అదే ఏడాది మహానటి సినిమాలో సుశీల పాత్రలో నటించింది. దీని తరువాత ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కనిపించింది. సౌత్ డైరెక్టర్ అంటే.. ఈ రెండు సినిమాల సమయంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు.  మహానటి సినిమాలో చాలామంది డైరెక్టర్స్ కనిపించారు. అందులో ఎవరు అనేది మాత్రం ఎవరికి తెలియరాలేదు.